E-Paper
Advertisement

విద్యార్థుల ఆందోళనలకు మద్దతు.. విజయవాడ ఎంపీ కూతురు పోస్టులు, రాజకీయ వర్గాల్లో చర్చ

విద్యార్థుల ఆందోళనలకు మద్దతు.. విజయవాడ ఎంపీ కూతురు పోస్టులు, రాజకీయ వర్గాల్లో చర్చ
Advertisement

Vijayawada: నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై సీజేపీ ఆందోళనకు అనేక మంది మద్దతు పలికారు. అందులోని అధికార పార్టీకి చెందిన నేతలు కూడా ఉన్నారు.  వారికి సంబంధించి ఇప్పుడిప్పుడే వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని కూతురు స్నిగ్ధ  కూడా విద్యార్థుల ఆందోళనకు మద్దతు పలికారు. సోషల్ మీడియాలో ఆమె చేసిన పోస్టులు వైరల్ అవుతున్నాయి.

విజయవాడ ఎంపీ కూతురు స్నిగ్ధ పోస్టులు- నీట్ పేపర్ లీకేజీపై ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సీజేపీ ఆందోళనకు దిగింది. సీజేపీ నిరసనకు దేశంలోని అన్నివర్గాల నుంచి మద్దతు లభించింది. దిగువ స్థాయి నుంచి ఉన్నత వర్గాల వరకు అందరూ మద్దతు ఇచ్చారు. ఎన్డీయే భాగస్వామి పార్టీలోని నేతల పుత్రరత్నాలు కూడా మద్దతు పలికారు. అలాంటి వారిలో విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని చిన్న కూతురు స్నిగ్ధ ఉన్నారు.

Advertisement

విద్యార్థుల ఆందోళనలకు మద్దతు- విద్యార్థుల ఆందోళనలపై పోలీసుల చర్యల నేపథ్యంలో కేశినేని స్నిగ్ధ తన సోషల్ మీడియాలో కేంద్రంపై విమర్శనాత్మక పోస్టులు పెట్టారు. స్నిగ్ధ చేసిన పోస్టులు ఇప్పుడు సోషల్ మీడియా‌లో వైరల్ అవుతున్నాయి. దీనిపై ఏపీలో రాజకీయ పార్టీలు ప్రధానంగా చర్చించుకోవడం మొదలైంది.

కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పోస్టులు పెట్టారు స్నిగ్ధ. సర్.. రాజీనామా లేఖ డ్రాఫ్ట్ చేయాలా? చేసిన సెటైరికల్ పోస్టు పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తోంది. స్నిగ్ధ పోస్టులను కొందరు నేతలు ప్రభుత్వంపై విమర్శగా భావిస్తున్నారు. మరి కొందరు రాజకీయ వ్యంగ్యంగా అభివర్ణిస్తున్న వారూ లేకపోలేదు.

Advertisement

 ఏపీ రాజకీయాల్లో చర్చ- కేశినేని స్నిగ్ధ చేసిన పోస్టులపై ఏపీ రాజకీయాల్లో చర్చ మొదలైంది. ఎందుకంటే కేంద్రంలోని ఎన్డీయేలో టీడీపీ కీలక భాగస్వామి ఉంది. ఆ పార్టీ ఎంపీ కేశినేని చిన్ని కుమార్తె కేంద్రాన్ని విమర్శించడం చర్చకు దారితీసింది. అయితే  కేశినేని స్నిగ్ధ వ్యక్తిగత సోషల్ మీడియా పోస్టులు మాత్రమేనని అంటున్నారు.

ALSO READ: జోగి రమేశ్ ఫ్యామిలీపై కోడలు సంచలన ఆరోపణలు.. పోలీసులకు ఫిర్యాదు, నోటీసులు ఇచ్చే ఛాన్స్?

దీంతో టీడీపీ అధికారిక వైఖరి ఏమిటన్న దానిపై చర్చించుకుంటున్నారు. తన అభిప్రాయాలు చెప్పినంత మాత్రాన స్నిగ్ధ- టీడీపీకి లింకు పెట్టడం ఏంటన్నది మరికొందరి ప్రశ్న. వారి వారి భావాలను వ్యక్తీకరించడంలో తప్పులేదని అంటున్నారు. ప్రధాన్ రాజీనామా తర్వాత.. ఒడిషాలోని ఓ బీజేపీ ఎంపీ కూతురు కూడా విద్యార్థులకు మద్దతు పలికిన సందర్భాలను గుర్తు చేస్తున్నారు. మొత్తానికి విజయవాడ ఎంపీ కేశినేని కూతురు స్నిగ్ధ వార్తల్లోకి నిలిచారు. ఈ వ్యవహారంపై ఎంపీ చిన్ని ఏమంటారో చూడాలి.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×