E-Paper
Advertisement

MP Avinash Reddy : హైకోర్టులో ఎంపీ అవినాష్‌కు షాక్

MP Avinash Reddy : హైకోర్టులో ఎంపీ అవినాష్‌కు షాక్
Advertisement

MP Avinash Reddy :

⦿  హైకోర్టులో ఎంపీ అవినాష్‌కు షాక్
⦿  బెయిల్ కండిషన్లు సడలించాలని పిటిషన్
⦿  వద్దని వాదించిన సీబీఐ తరఫు లాయర్లు
⦿  ట్రయల్ కోర్టులోనే చూసుకోమని ఆదేశం

Advertisement

హైదరాబాద్, స్వేచ్ఛ : కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి మరోసారి తెలంగాణ హైకోర్టులో నిరాశే ఎదురైంది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న అవినాష్ ముందస్తు బెయిల్ కండిషన్లను సడలించాలని కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై బుధవారం హైకోర్టు విచారించింది. కేసు ట్రయల్ కోర్టులో నడుస్తున్న సమయంలో బెయిల్ షరతులు సడలించొద్దని సీబీఐ వాదనలు వినిపించింది. దీంతో ట్రయల్ కోర్టులో పిటిషన్ వేసుకోవచ్చని అవినాష్‌ను కోర్టు ఆదేశించింది. కాగా బెయిల్ మంజూరు చేసిన సమయంలో అవినాష్, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి దేశం విడిచి వెళ్లరాదని కోర్టు షరతు విధించింది. ఈ నెల 26 నుంచి నవంబర్ 2 వరకూ జపాన్ పర్యటనకు వెళ్లేందుకు ఈ షరతు సడలించి, అనుమతివ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత అవినాష్ ట్రయిల్ కోర్టులోనే చూసుకోవాలని హైకోర్టు సూచించింది.

ALSO READ : సిలిండర్లపై మూడు గ్యాస్‌ కంపెనీలతో ఒప్పందం.. మంత్రి నాదెండ్ల మనోహర్‌

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×