E-Paper
Advertisement

Janasena: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మోదీ కేబినెట్‌ విస్తరణ.. ఈసారి జనసేనకు అవకాశం!

Janasena: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మోదీ కేబినెట్‌ విస్తరణ.. ఈసారి జనసేనకు అవకాశం!
Advertisement

Janasena: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మోదీ కేబినెట్ పునర్ వ్యవస్థీకరించ నున్నారా? ఫిబ్రవరి లేదా మార్చిలో జరిగే అవకాశముందా? ఈసారి ఏపీ నుంచి జనసేనకు అవకాశం ఉందా? ఆ పార్టీ నుంచి రేసులో ఎవరు ఉన్నట్లు? ఇదే చర్చ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ హాట్ చర్చ జరుగుతోంది.

మార్చిలోపు మోదీ కేబినెట్‌ విస్తరణ

Advertisement

బుధవారం ఢిల్లీ వెళ్లిన సీఎం చంద్రబాబు-హోంమంత్రి అమిత్ షా మద్య రాజకీయాలపై అరగంట పాటు చర్చ జరిగింది. కేంద్ర కేబినెట్ పునర్ వ్యవస్థీకరణపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఈసారి ఏపీ నుంచి ఎవరికి ఛాన్స్ ఇవ్వాలనే దానిపై ఇరువురు నేతల మధ్య మంతనాలు జరిగినట్టు తెలుస్తోంది. ఈసారి జనసేనకు అవకాశం దక్కనున్నట్లు ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్‌లో ప్రచారం సాగుతోంది.

Advertisement

ఇప్పటికే కేంద్రంలో టీడీపీ కీలక పదవులు తీసుకుంది. మోదీ కేబినెట్ రెండు మంత్రిపదవులు, గవర్నర్ పదవి, అదనపు అడ్వకేట్ జనరల్ వంటి పదవులు దక్కాయి. ఏప్రిల్‌లో బెంగాల్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికలు జరిగిన కొద్దిరోజులకు తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికల నగారా మోగనుంది. 

ఈసారి జనసేనకు అవకాశం, రేసులో ఆ నేతలు

ఈ నేపథ్యంలో మోదీ కేబినెట్ విస్తరణకు దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఫిబ్రవరి లేదా మార్చిలో కేంద్ర కేబినెట్ విస్తరణ ఉండే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈసారి ఏపీ నుంచి ఎవరికి అవకాశం వస్తుంది? టీడీపీకి మరో మంత్రి పదవి దక్కనుందా? లేకుంటే జనసేనకు రానుందా? దాదాపుగా జనసేన వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. 

అదే జరిగితే జనసేన నుంచి మంత్రి పదవి రేసులో ఎవరు ఉన్నట్లు అనేదానిపై ఏపీలోని అధికార పార్టీలో చర్చ జరుగుతోంది. తొలుత మోదీ కేబినెట్‌లో జనసేనకు చోటు లభిస్తుందని వార్తలు వచ్చాయి. నాగబాబుకు అవకాశం ఇవ్వవచ్చని ప్రచారం సాగింది. ఈలోగా ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. రేపో మాపో ఆయన్ని కేబినెట్‌లోకి తీసుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ALSO READ: టీడీపీ నేత ప్రభాకర్ కిడ్నాప్.. వైసీపీ నేతల హస్తం?

ఈసారి మోదీ కేబినెట్‌లో చోటు దక్కించుకోవాలని ఆలోచన చేస్తోందట జనసేన. ఆ పార్టీకి ఇద్దరు ఎంపీలు మాత్రమే ఉన్నారు. మచిలీపట్నం నుంచి బాలశౌరి, కాకినాడ ఉదయ్ శ్రీనివాస్ ఉన్నారు. బాలశౌరి గత ఎన్నికల ముందు వైసీపీ వీడి జనసేనలో చేరడం, ఆయన గెలుపొందడం జరిగిపోయింది.  ఈసారి ఆయనకు అవకాశం ఇస్తారా? కాకినాడకు చెందిన శ్రీనివాస్‌కు అవకాశం దక్కనుందా?

ఈ రెండు కాకుండా నాగబాబుని కేంద్ర కేబినెట్‌లోకి పంపిస్తారా? అనేదానిపై ఆ పార్టీ నేతలు తలో విధంగా చర్చించుకుంటున్నారు. ఎటుచూసినా ఈసారి మోదీ కేబినెట్‌లోని జనసేన అడుగుపెట్టడం ఖాయం.  ఆ పార్టీ తరపున కేంద్రమంత్రి పదవి ఎవర్ని వరించనుందో చూడాలి. 

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×