E-Paper
Advertisement

Raghu Rama on Jagan: రఘురామ్ లాస్ట్ స్పీచ్.. జగన్ చేసింది కరెక్టేనంటూ వ్యాఖ్య

Raghu Rama on Jagan: రఘురామ్ లాస్ట్ స్పీచ్.. జగన్ చేసింది కరెక్టేనంటూ వ్యాఖ్య
Advertisement

Raghu Rama on Jagan: రుషికొండ ప్యాలెస్‌ గురించి అసెంబ్లీలో చిన్నపాటి చర్చ జరిగింది. నేతల మాటల నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రుషికొండ ప్యాలెస్ విషయంలో జగన్ అల్లరైనా, మంచి ప్రభుత్వం రావడానికి దోహదం చేశారన్నారు.

డిప్యూటీ స్పీకర్‌గా టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ పదవికి ఆయనొక్కరే నామినేషన్ వేయడంతో ఏకగ్రీవమైనట్లు స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రకటించారు. ఈ సందర్భంగా సభలో విశాఖ రుషికొండ ప్యాలెస్‌పై చిన్నపాటి చర్చ జరిగింది.

Advertisement

మాజీ సీఎం జగన్‌ని ఎమ్మెల్యేగా రఘురామరాజు తన పొగడ్తలతో ముంచెత్తారు. 500 కోట్లతో రుషికొండ ప్యాలెస్ కట్టి జగన్ అల్లరి పాలైనా, మంచి ప్రభుత్వం రావడానికి దోహదపడ్డారంటూ తనదైనశైలిలో వ్యాఖ్యానించారు. సింపుల్‌గా చెప్పాలంటే ఆయన తన రాజకీయ సమాధిని కట్టుకున్నారని చెప్పుకొచ్చారు.

రుషికొండ ప్యాలెస్ విషయంలో మొదటి నుంచి జరిగిన ప్రతీ విషయాన్ని పూసగుచ్చి మరీ వివరించారు. అప్పటివరకు టూరిజం ప్రాజెక్టని చెప్పిన గత ప్రభుత్వం, తాను విశాఖ వస్తున్నానంటూ జగన్ చెప్పడం వెనుక అసలు మతలబుని బయటపెట్టారు.

Advertisement

ALSO READ: దమ్ముంటే అడుగు పెట్టు.. ఆపై మాట్లాడు.. ఇచ్చిపడేసిన షర్మిల

రఘురామరాజు మాటలను సభలో సభ్యులంతా ఒకటే నవ్వులు. వేల కోట్లు రకరకాల రూపంలో దుర్వినియోగం అయ్యాయని అన్నారు. ఆయన తన రాజకీయ సమాధి కట్టుకున్నారని వెల్లడించారు. ఈ క్రమంలో విశాఖ ఎమ్మెల్యేలు రుషికొండ ప్యాలెస్ గురించి తమదైన శైలిలో చెప్పుకొచ్చారు.

బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు ప్యాలెస్ గురించి ప్రతీ విషయాన్ని క్షుణ్ణంగా సభ్యులకు వివరించారు. అక్కడ మనం ఏమీ చెయ్యాల్సిన అవసరం లేదని, అంతా ఆటో వాషింగ్ అంటూ వ్యాఖ్యానించారాయన. అందులోని విలాస వస్తువులు చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందేన్నారు.

 

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×