E-Paper
Advertisement

Arava Sridhar-Veena: అరవ శ్రీధర్-వీణా వ్యవహారం.. మధ్యలోకి మూడో వ్యక్తి ఎవరు? వీడియోలో కీలక విషయాలు

Arava Sridhar-Veena:  అరవ శ్రీధర్-వీణా వ్యవహారం.. మధ్యలోకి మూడో వ్యక్తి ఎవరు? వీడియోలో కీలక విషయాలు
Advertisement

Arava Sridhar-Veena: ఎమ్మెల్యే అరవ శ్రీధర్- వీణ వ్యవహారం మాటేంటి? వీరి ఎపిసోడ్‌కు ముగింపు ఎప్పుడు? సీరియల్ మాదిరిగా ఇంకా సాగుతోందా? రోజుకో కొత్త వీడియో హంగామా చేస్తోందా? కమిటీ రిపోర్టు ఎంతవరకు వచ్చింది? జనసేన పార్టీ వేసిన కమిటీకి పలు ప్రశ్నలు సంధించింది బాధితురాలు వీణా. ఇంతకీ ఆమె ఏమన్నారో ఒక్కసారి చూద్దాం.

అరవ శ్రీధర్-వీణా వ్యవహారం.. మధ్యలోకి మూడో వ్యక్తి 

Advertisement

జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు హర్ష వీణ మరో వీడియో విడుదల చేశారు. ఆ పార్టీ వేసిన కమిటీ గురించి కొన్ని అంశాలను ఆమె లేవనెత్తారు. కమిటీ విచారణ చేపట్టాల్సింది జన సైనికులను కాదని, తనను- శ్రీధర్‌ను విచారించాలని పేర్కొన్నారు. ఎందుకంటే వ్యక్తిగత వివాదమని, తాను మీడియా ముందుకొచ్చినా దాన్ని రాజకీయం చేస్తున్నారని చెప్పుకొచ్చింది బాధితురాలు వీణ. తాను తప్పు చేయలేదని, అందుకే ఆధారాలతో సహా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నానంటూ కమిటీకి సంకేతాలు ఇచ్చారు ఆమె.

మా ఇద్దరి మధ్య తలెత్తిన వివాదంలో తనతో ఎవరూ మాట్లాడలేదని తేల్చి చెప్పింది బాధితురాలు. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై వేసిన కమిటీ రిపోర్ట్ ఎందుకు బయటకు రాలేదని ప్రశ్నించింది. తనను విచారణకు రమ్మని పిలిచినా రాలేదంటూ కమిటీ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. జన సైనికులను విచారిస్తే వాళ్ళు అరవ శ్రీధర్ కు అనుకూలంగా మాట్లాడరా? అంటూ ప్రశ్నలు రైజ్ చేసింది. ఈసారి రైల్వేకోడూరు ఇన్చార్జ్ ముక్కా రూపానందరెడ్డి గురించి కొన్ని విషయాలు బయటపెట్టారు.

Advertisement

జనసేన కమిటీపై వీణా ఆగ్రహం..  నేరుగా న్యాయస్థానానికే

ఆ వ్యక్తికి సంబంధించి వివరాలను న్యాయస్థానానికి అందజేస్తానని చెప్పకనే చెప్పారు. ముక్కా రూపానంద రెడ్డి ఫ్యామిలీ తనను రకరకాలుగా బెదిరిస్తున్నారని కొత్త విషయాలు బయటపెట్టింది. డబ్బు, అధికారం ఉందని రాజకీయం చేస్తున్నారని, వాళ్ళు ఏం తప్పులు చేశారో ఆధారాలతో సహా బయట పెడతానని మరో బాంబు పేల్చింది.  తాను చెప్పింది నిజం కాదని భావిస్తే ఆధారాలు చూపించాలని సవాల్ విసిరింది.

డబ్బులు ఇచ్చి తనపై ఏం చేశారో కాల్ రికార్డ్స్ తన దగ్గర ఉన్నాయని, ముక్కా రూపానంద ఫ్యామిలీ ఈ స్థాయికి దిగజారుతుందని భావించలేదని తెలిపింది. రాజకీయ జీవితం గురించి మాట్లాడుతూ రాజకీయం చేస్తున్నారని, అమ్మాయి జీవితం గురించి ఆలోచించడం లేదని వాపోయింది. సున్నితమైన మహిళ ఈ మోసాన్ని తట్టుకోలేక తనువు చాలిస్తే దరిద్రం వదిలిందని ఊరుకుంటారా? మోసం చేసి దర్జాగా తిరుగుతుంటే అరవ శ్రీధర్‌ను తాము ఇంకా ప్రోత్సహించాలా? అంటూ ప్రశ్నలు లేవనెత్తింది.

ALSO READ: నల్లమల అడవిలో కొనసాగుతున్న మంటల ఉధృతి.. ఆందోళనలో వన్యప్రాణుల ప్రేమికులు

మోసం చేయలేదు, మాట్లాడటం మానేశానని అరవ శ్రీధర్ తన గురించి ధైర్యంగా చెప్పగలడా? అధికారికంగా ఎక్కడెక్కడ ఏయే పనుల్లో అక్రమాలు చేశారో తన దగ్గర ఆధారాలు ఉన్నాయని తేల్చి చెప్పింది బాధితురాలు. రాజకీయం చేయకుండా ఉన్న నిజాలు బయట పెడితే పరిస్థితి ఏమిటి? మీరు ఏమైపోతారో ఆలోచించాలని పేర్కొంది. తప్పు చేసిన వ్యక్తికి కాపలా కాస్తున్నారా? తప్పు చేసిన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బయటకు రాడు, వీళ్ళు రానివ్వరని తేల్చేసింది.

 

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×