E-Paper
Advertisement

Adani Power Plant: కడపలో అదానీ పవర్ ప్లాంట్ సిబ్బందిపై ఎమ్మెల్యే వర్గీయుల దాడి

Adani Power Plant: కడపలో అదానీ పవర్ ప్లాంట్ సిబ్బందిపై ఎమ్మెల్యే వర్గీయుల దాడి
Advertisement

Adani Power Plant: కడపలో ఓ ఎమ్మెల్యే అనుచరులు రెచ్చిపోయారు. కంపెనీకి సంబంధించిన పనులు అప్పగించలేదని, ఏకంగా కంపెనీ సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంతకీ ఎక్కడ? అన్న డీటేల్స్‌లోకి వెళ్దాం.

కడప జిల్లా కొండాపురం మండలంలోని రాగి కుంట ప్రాంతంలో 470 ఎకరాల విస్తీర్ణంలో 1000 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ నిర్మాణ పనులు చేపట్టింది అదానీ సంస్థ. క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేసుకుని స్థలాన్ని చదును చేస్తున్నాయి అదానీ-రిత్విక్ సంస్థలు.

Advertisement

వాటి పనులు తమకే ఇవ్వాలని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వర్గీయులు సిబ్బందిపై రాళ్ల దాడి చేశారు. అదానీ సంస్థ క్యాంపు కార్యాలయం, జెసీబీ అద్దాలు పగలగొట్టారు. తమ మాట వినకపోవడంతో ఆదానీ కంపెనీ వాహనాలను ధ్వంసం చేశారు.

ఎమ్మెల్యే బంధువులు శివ నారాయణ రెడ్డి, రాజేష్ రెడ్డిలు కంపెనీ ప్రతినిధులతో వాగ్వాదానికి దిగారు. కంపెనీ ప్రతినిధులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే రంగంలోకి పోలీసులు దిగారు. కంపెనీ ప్రతినిధులపై దాడికి పాల్పడిన ఎమ్మెల్యే అనుచరులపై కేసు నమోదు చేశారు పొద్దుటూరు పోలీసులు.

Advertisement

 

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×