E-Paper
Advertisement

Pulivendula Politics: జగన్‌కు కూటమి కౌంటర్.. బాయ్ కాట్ కాదు, బావిలో పడండి

Pulivendula Politics:  జగన్‌కు కూటమి కౌంటర్.. బాయ్ కాట్ కాదు, బావిలో పడండి
Advertisement

Pulivendula Politics: ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. పులివెందుల జెడ్పీ ఉప ఎన్నికపై అధికార-విపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. మాజీ సీఎం జగన్, ఎంపీ అవినాష్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కూటమి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

రీపోలింగ్‌ను బాయ్ కాట్ చేస్తున్నామంటూ వైసీపీ చేసిన ప్రకటనపై మండిపడ్డారు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి. బాయ్ కాట్ కాదు.. బావిలో పడి చావండని వ్యాఖ్యానించారు. ఏపీకి ఐపీ చేసిన ఘనత జగన్ సొంతం చేసుకున్నారని అన్నారు. పీఎం మోదీ సహకారంతో రాష్ట్రాన్ని వీఐపీ చేస్తున్న ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. ఉప ఎన్నికపై న్యాయపోరాటం చేస్తామంటే చేయాలని, అవసరమైతే సుప్రీంకోర్టుకి వెళ్లాలని వైసీపీకి సలహా ఇచ్చేశారు.

Advertisement

మరోవైపు పులివెందుల టీడీపీ ఇన్‌ఛార్జ్ బీటెక్ రవి నోరు విప్పారు. జడ్పీటీసీ ఉప ఎన్నిక ప్రశాంతంగా జరిగిందన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదన్నారు. ఓడిపోతామని తెలిసి వైసీపీ లేనిపోని సాకులు చెబుతోందని దుయ్యబట్టారు. తొలుత రీపోలింగ్‌ డిమాండ్ చేసిన వైసీపీ, మళ్లీ బహిష్కరిస్తున్నట్లు ఎంపీ అవినాష్ రెడ్డి చెప్పడం సరికాదన్నారు. మొత్తం 15 బూతుల్లో రీపోలింగ్ నిర్వాహించాలని మళ్లీ డిమాండ్ చేస్తోందని గుర్తు చేశారు.

ఓటమిని అంగీకరించలేక వైసీపీ డైవర్షన్ పాలిటిక్స్‌కి దిగిందన్నారు మంత్రి సవిత. జనాలు ఓటు వేయలేదని గ్రహించే జగన్ మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి రీపోలింగ్ కోరారని తెలిపారు. వాళ్లే రీపోలింగ్ అడిగి మళ్లీ ఇప్పుడు బహిష్కరిస్తున్నట్లు ప్రకటించడం వెనుక ఉద్దేశం ఏంటని ప్రశ్నించారు. ప్రజలే మిమ్మల్ని బహిష్కరించారనే విషయం స్పష్టంగా అర్థమవుతోందన్నారు.

Advertisement

ALSO READ: జగన్ ప్రెస్‌మీట్.. పుటేజ్ బయటపెడతారా? ఓటమిని అంగీకరించినట్టేనా?

రీపోలింగ్ పై వైసీపీ చేసిన డిమాండ్ ఏంటి? పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో అవకతవకలు జరిగాయని ఈసీకి ఫిర్యాదు చేసింది వైసీపీ. ఈ నేపథ్యంలో రెండు బూత్ ల్లో బుధవారం రీపోలింగ్ ఆదేశాలు ఇచ్చింది. ఈ సందర్భంగా వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

రీపోలింగ్‌ను తాము బహిష్కరిస్తున్నట్లు వెల్లడించారు. కంటితుడుపు చర్యగా రీపోలింగ్ నిర్వహిస్తున్నారని, పులివెందులలో కొత్త సంస్కృతిని సీఎం చంద్రబాబు తెచ్చారని మండిపడ్డారు. చివరకు కేంద్ర బలగాలతో రీపోలింగ్ నిర్వహించాలన్నది వైసీపీ డిమాండ్. మొత్తానికి వైసీపీ చేస్తున్న డ్రామాలను కూటమి నేతలు గమనిస్తున్నారు.

 

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×