E-Paper
Advertisement

ప్రపంచంలోనే ఖరీదైన మామిడి.. మన దగ్గరకొచ్చింది.. కొనాలంటే ఆస్తులు అమ్మాల్సిందే!

ప్రపంచంలోనే ఖరీదైన మామిడి.. మన దగ్గరకొచ్చింది.. కొనాలంటే ఆస్తులు అమ్మాల్సిందే!
Advertisement

Miyazaki Mango: మామిడి పండు అంటేనే మనకు ముందుగా బంగినపల్లి లేదా కలెక్టర్ రకాలు గుర్తొస్తాయి. వీటి ధర మహా అయితే కిలో వందల్లో ఉంటుంది. కానీ, ఆంధ్రప్రదేశ్‌లో పండుతున్న ఒక రకం మామిడి పండు ధర వింటే మాత్రం ఎవరైనా నోరెళ్లబెట్టాల్సిందే. ఎందుకంటే దీని ధర ఏకంగా కిలో రూ. 2.70 లక్షలు!

జపాన్‌కు చెందిన ఈ అరుదైన రకం పేరు ‘మియాజాకీ’. దీనిని అక్కడ ‘సూర్యుడి గుడ్డు’ (ఎగ్ ఆఫ్ ది సన్) అని కూడా పిలుస్తారు. సాధారణంగా ఇలాంటి ఖరీదైన పండ్లు విదేశాల్లోనే ఉంటాయని మనం అనుకుంటాం. కానీ, ఇప్పుడు మన విజయవాడలో ఇవి కనువిందు చేస్తున్నాయి. విజయవాడ తూర్పు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తన ఇంటి ఆవరణలో ఈ చెట్టును ఎంతో ఇష్టంగా పెంచుతున్నారు.

Advertisement

ఈ మామిడి పండు ప్రత్యేకత ఏమిటంటే.. ఇది పండినప్పుడు ఎర్రటి రంగులో మెరిసిపోతూ ఆకర్షణీయంగా కనిపిస్తుంది. దీని రుచి, సువాసన ఇతర మామిడి పండ్ల కంటే చాలా భిన్నంగా, ఎంతో మధురంగా ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో దీనికి విపరీతమైన డిమాండ్ ఉండటం వల్లే ధర అంత ఎక్కువగా ఉంటుంది. మన వాతావరణంలో కూడా ఇలాంటి అరుదైన రకాలు పండుతుండటం చూస్తుంటే ఆశ్చర్యంగానూ, సంతోషంగానూ ఉంది కదూ!

Also Read: బీటెక్ పట్టా ఉంది.. కానీ బతుకు భారమైంది.. మంటల్లో మాడిపోయిన యువతి కలలు!

Advertisement

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×