E-Paper
Advertisement

చిన్నారి మిస్సింగ్ కేసులో బిగ్ ట్విస్ట్.. కీలక ఆధారమైన కుక్క మృతి

చిన్నారి మిస్సింగ్ కేసులో బిగ్ ట్విస్ట్.. కీలక ఆధారమైన కుక్క మృతి
Advertisement

Girl Missing Case: కాకినాడ జిల్లా తుని మండలానికి చెందిన చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు ఊహించని మలుపు తీసుకుంది. ఈ కేసులో కీలక ఆధారంగా ఉన్న పెంపుడు కుక్క.. అకస్మాత్తుగా మృతి చెందడం పలు అనుమానాలకు తావిస్తోంది. చిన్నారి కోసం గాలించే క్రమంలో పోలీసులు.. ఈ శునకానికి జీపీఎస్ ట్రాకర్ ను అమర్చారు. ఈ క్రమంలో 80 నిమిషాల వ్యవధిలో 8 కి.మీ మేర తిరిగిన ఈ కుక్క.. ఇంటికి తిరిగొచ్చి ఒక్కసారిగా కుప్పకూలింది.

అయితే శునకం శుక్రవారం నుంచి ఎలాంటి ఆహారం తీసుకోలేదని జ్ఞానేశ్వరి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. పైగా అడవిలోకి పంపేందుకు అధికారులు ప్రయత్నించినా.. అది వెళ్లలేదని పేర్కొంటున్నారు. కాగా మరణానికి ముందు కుక్కకు సంబంధించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఓ బోనులో ఉన్న కుక్క.. కనీసం నిలబడలేకపోయింది. కాళ్లు వణుకుతున్న స్థితిలో కనిపించింది. ఆహారం, నీరు పెట్టినప్పటికీ అది తినలేదని స్థానికులు చెబుతున్నారు. అయితే కుక్క సహజంగా మరణించిందా? మరో కారణం ఏమైనా ఉందా? అన్న అనుమానాలు ప్రస్తుతం కలుగుతున్నాయి.

Advertisement

Also Read: ఫ్రిజ్‌లో పెట్టినా కూరగాయలు పాడవుతున్నాయా? మీరు చేసే ఆ చిన్న తప్పే కారణం!

కేసులో ఎంతో కీలకంగా ఉన్న కుక్క.. ఇలా అర్ధంతరంగా మరణించడం ఏంటన్న ప్రశ్న సహజంగానే ఉత్పన్నమవుతోంది. ఇప్పుడు జ్ఞానేశ్వరి జాడను పోలీసులు ఏ విధంగా కనిపెడతారన్న ఉత్కంఠ స్థానికుల్లో మెుదలైంది. కుక్క లేకుండా పాపను పట్టుకోవడం పోలీసులకు అతిపెద్ద సవాలు కానుందని స్థానికంగా చర్చించుకుంటున్నారు. కాగా గత శనివారం ఇంటివద్ద ఆడుకుంటున్న జ్ఞానేశ్వరి కనిపించకుండా పోయింది. బాలికతో పాటు అదృశ్యమైన శునకం మంగళవారం తిరిగొచ్చింది. దాని సాయంతో పాప ఆచూకి కనుగొనాలని భావిస్తున్న పోలీసులకు కుక్క మృతితో గట్టి ఎదురుదెబ్బ తగిలిందని చెప్పవచ్చు.

Advertisement

Also Read: మహిళలపై అనుచిత వ్యాఖ్యలు.. షబ్బీర్ అలీపై ఏఐసీసీ సీరియస్.. షోకాజ్ నోటీసులు జారీ

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×