E-Paper
Advertisement

చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు కొత్త మలుపు.. ఇప్పుడు కియా కారు చుట్టూ, అసలు లింకేంటి?

చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు కొత్త మలుపు.. ఇప్పుడు కియా కారు చుట్టూ,  అసలు లింకేంటి?
Advertisement

Gnaneswari Missing Case: రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు ఎంత వరకు వచ్చింది? పోలీసులు ఎలాంటి వివరాలు సేకరించారు? చిన్నారి ఆచూకీ కోసం చేసిన ప్రయత్నాలు ఫలించాయా? ఈ కేసు వ్యవహారం ఇప్పుడు కియా కారు చుట్టూ ఎందుకు తిరుగుతోంది? చిన్నారికి-కియా కారుకు ఏంటి సంబంధం, ఇంకా డీటేల్స్‌లోకి వెళ్తే..

చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు: కాకినాడ జిల్లా తుని మండలం సీహెచ్ అగ్రహారానికి చెందిన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో దర్యాప్తు జరుగుతోంది. ఈ కేసు కొత్త మలుపు తిరిగింది. నెల రోజులుగా ఆచూకీ లేకుండా పోయింది చిన్నారి. ఈ కేసులో ఓ అనుమానాస్పద కారుపై పోలీసులు ఫోకస్ చేశారు. దీంతో ఈ కేసును ఆ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Advertisement

గణేశ్-భవాని దంపతుల కూతురు రెండేళ్ల జ్ఞానేశ్వరి. జూన్ 6న ఈ దంపతులు పని చేస్తున్న పామాయిల్ తోటలో ఆడుకుంటుండగా చిన్నారి అదృశ్యమైంది. ఆనాటి నుంచి చిన్నారి జాడ కోసం పోలీసులు గాలిస్తున్నారు. చివరకు ప్రకటనలు ఇచ్చారు. పాప ఆచూకీ చెప్పినవారికి బహుమతి ఇస్తామని ప్రకటన చేశారు.

కియా కారు చుట్టూ కొత్త మలుపు: ఓ వైపు విచారణ జరుగుతుండగా చిన్నారి అదృశ్యమైన రోజు.. ఆ ప్రాంతంలో ఓ కియా కారు అనుమానాస్పదంగా కనిపించడం ఈ కేసులో మరో కోణం బయటపడింది. రెండు రోజులుగా పరిసర ప్రాంతాల్లో ఆ కారు తిరుగుతుండటంతో కుటుంబసభ్యుల్లో అనుమానం మొదలైంది.

Advertisement

చిన్నారి మిస్సింగ్ ముందు రోజు నర్సీపట్నం సమీపంలో తమ బంధువుల్లో ఒకరిని ఆ కారు ఢీ కొట్టిందని ఆరోపిస్తున్నారు కుటుంబసభ్యులు. దీంతో అనుమానాలు రెట్టింపు అయ్యాయి. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో అప్రమత్తమైన పోలీసులు, అటు వైపు నుంచి దర్యాప్తు చేపట్టారు.

ALSO READ: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు!

దర్యాప్తులో నిమగ్నమైన పోలీసులు: కేవలం ప్రమాదమా? కావాలనే ఎవరైనా చేశారా? ఆ కారు నంబర్ ఆధారంగా ఎవరి పేరు మీద రిజిస్టర్ అయ్యింది? కొన్ని రోజులుగా ఆ కారు ఎక్కడెక్కడ తిరిగింది? సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా సమగ్రంగా విచారణ చేస్తున్నారు. ఈ కారు మిస్టరీ వీడితే చిన్నారి అదృశ్యం కేసులో కీలక ఆధారాలు లభించడం ఖాయమని అంటున్నారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×