E-Paper
Advertisement

Anantapur News: జవాన్ తల్లిదండ్రులకు అన్నం తినిపిస్తూ ఏడ్చేసిన మంత్రి సవితమ్మ

Anantapur News: జవాన్ తల్లిదండ్రులకు అన్నం తినిపిస్తూ ఏడ్చేసిన మంత్రి సవితమ్మ
Advertisement

Anantapur News: తమ కొడుకు ఈ లోకంలోలేడని జీర్ణించుకోలేక పోతున్నారు జవాన్ మురళీ‌నాయక్ తల్లిదండ్రులు. వారిని ఓదార్చడం ఎవరివల్ల కావడంలేదు. కొడుకు తలచుకుని కన్నీరు మున్నీరు అవుతున్నారు పేరెంట్స్.  కనీసం మంచి నీళ్లు కూడా ముట్టడంలేదు. వారిని ఆ స్థితిలో చూసి చలించిపోయారు మంత్రి కవిత. ఓ వైపు ఆ తల్లికి ధైర్యం చెబుతూ అన్నంపెడుతూ కాసింత ఎమోషన్ అయ్యారు.

దేశ సరిహద్దును ఇల్లుగా భావించాడు జవాను మురళీ నాయక్. పౌరుల రక్షణను తన కర్తవ్యంగా మార్చుకున్నాడు. ఎత్తైన పర్వతాల్లో ఎముకలు కొరికే చలిని సైతం లెక్క చేయలేదు. కంటిమీద కునుకు లేకుండా కాపలా కాస్తూ శత్రువును ఎదురొడ్డి వీరమరణం పొందాడు ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన జవాన్ మురళీ నాయక్.

Advertisement

జమ్మూకాశ్మీర్‌ బోర్డర్‌లో ‘ఆపరేషన్ సిందూర్’ నేపథ్యంలో తెలుగు జవాన్ మురళీనాయక్ వీర మరణం పొందాడు. సత్యసాయి జిల్లాకు చెందిన మురళీ చిన్నప్పటి నుంచి పడిన కష్టాలు అన్నీఇన్నీకావు. చివరకు అగ్నివీర్ ద్వారా సైన్యంలో అడుగుపెట్టాడు.  చేతికి అందివచ్చిన కొడుకు ఈ లోకంలో లేడని తెలిసి శ్రీరాం నాయక్-జ్యోతీ బాయి దంపతులు విలవిల్లాడిపోతున్నారు.

ఎంతమంది వచ్చి ఓదార్చినా కన్న కొడుకు లేని లోటును ఎవరూ తీర్చలేకపోతున్నారు. గోరంట్ల మండలంలో కళ్లితండాలో అగ్నివీర్‌ మురళీనాయక్‌ తల్లిదండ్రుల బాధ. వారిని ఓదార్చడం ఎవరి తరం కాలేదు. చివరకు సోమవారం మంత్రి సవిత మురళీనాయక్ ఇంటికి వెళ్లింది. కుటుంబ సభ్యులను ఓదార్చి వారికి దైర్యం చెప్పే ప్రయత్నం చేశారు.

Advertisement

ALSO READ: అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు, స్పాట్ లో 30 మంది శ్రీవారి భక్తులు

ఆథ్యాత్మికంగా చెప్పాల్సినవన్నీ ఆ దంపతులకు చెప్పారు. కానీ వారి మనసంతా కొడుకుపైనే ఉంది. చివరకు మురళీ తల్లి మంత్రి సవిత తన చేతులతో అన్నం పెట్టారు. ఆ స్థితిలో ఆమెని చూసి మంత్రి సవిత కంటతడి పెట్టారు. రాజకీయ నాయకులు, మాజీ సైనికులు, అధికారులు ఎంత దైర్యం చెప్పినా ఆ తల్లిని ఓదార్చడం ఎవరితరం కావడంలేదు.

 

 

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×