E-Paper
Advertisement

జగన్ రక్తంలోనే అది ఉంది.. మంత్రి సవిత షాకింగ్ కామెంట్స్!

జగన్ రక్తంలోనే అది ఉంది.. మంత్రి సవిత షాకింగ్ కామెంట్స్!
Advertisement

Minister Savita: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై మంత్రి సవిత చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. వైకాపా తీరుపై ఆమె విరుచుకుపడుతూ.. ఆ పార్టీని ‘హంతకులను తయారుచేసే ఫ్యాక్టరీ’గా అభివర్ణించారు. సమాజానికి మేలు చేసే నాయకులను అందించడం తెలుగుదేశం పార్టీ నైజమైతే, నేరగాళ్లను ప్రోత్సహించడం జగన్ మార్క్ రాజకీయమని ఆమె విమర్శించారు. రాజకీయ లబ్ధి కోసం శవాలతో రాజకీయం చేయడం వైకాపా నేతలకు అలవాటుగా మారిందని ఆమె ధ్వజమెత్తారు.

ముఖ్యంగా సుబ్రమణ్యం హత్య ఉదంతాన్ని ప్రస్తావిస్తూ.. మాజీ ఎమ్మెల్సీ అనంతబాబు వ్యవహారం జగన్ సైకో చేష్టలకు పరాకాష్ట అని మంత్రి మండిపడ్డారు. సొంత డ్రైవర్‌ను చంపి, డోర్ డెలివరీ చేసిన ఘటన నాగరిక సమాజం తలదించుకునేలా ఉందన్నారు. ఇలాంటి నేరస్తులను వెనకేసుకురావడం జగన్ రక్తంలోనే ఉందని, గతంలో సొంత తండ్రి శవాన్ని పక్కన పెట్టుకుని సంతకాలు సేకరించడం, బాబాయ్ గొడ్డలి పోటు ఉదంతాలే దీనికి నిదర్శనమని ఆమె గుర్తు చేశారు.

Advertisement

కేవలం రాజకీయ ప్రత్యర్థులనే కాకుండా.. సాక్షులను, బాధితులను, ఆఖరికి న్యాయమూర్తులను కూడా బెదిరించి లొంగదీసుకోవాలని చూడటం జగన్ నైజమని సవిత ఆరోపించారు. వ్యవస్థలను మేనేజ్ చేస్తూ ఎంతకాలం తప్పించుకుంటారని ఆమె ప్రశ్నించారు. సుబ్రమణ్యం హత్య కేసులో నిందితులు ఎంతటి వారైనా, వారి వెనుక ఎవరున్నా వదిలే ప్రసక్తే లేదని ఆమె స్పష్టం చేశారు. బాధితులకు న్యాయం జరిగే వరకు ప్రభుత్వం అండగా ఉంటుందని, హంతకులకు శిక్ష పడటం ఖాయమని మంత్రి సవిత తేల్చి చెప్పారు. ఈ తరహా రాజకీయాలకు స్వస్తి పలకాల్సిన సమయం ఆసన్నమైందని ఆమె పిలుపునిచ్చారు.

Also Read: పాలకొల్లులో సంచలనం.. ఎల్కేజీ విద్యార్థిని నిర్బంధించిన ప్రైవేట్ స్కూల్!

Advertisement

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×