E-Paper
Advertisement

Roja: పవన్ ఇల్లు కొండమీద లేదా? కోర్టు కంటే గొప్పోడా?.. రోజా స్ట్రాంగ్ కౌంటర్..

Roja: పవన్ ఇల్లు కొండమీద లేదా? కోర్టు కంటే గొప్పోడా?.. రోజా స్ట్రాంగ్ కౌంటర్..
Advertisement

Roja: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు మరోసారి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మంత్రి రోజా. పవన్‌ విశాఖ పర్యటనలో చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు చేశారు. రుషికొండపై పవన్ కల్యాణ్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖను పాలనారాజధానిగా ఎంచుకున్నందుకే పవన్ కల్యాణ్, చంద్రబాబు విషం కక్కు తున్నారంటూ ఫైర్ అయ్యారు.

రుషికొండపై నిర్మాణాలకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చిందని.. హైకోర్టు నిబంధనలకు లోబడి నిర్మాణాలు జరుగుతున్నాయని మంత్రి రోజా క్లారిటీ ఇచ్చారు. ప్రభుత్వ భూముల్లో భవనాలు నిర్మిస్తుంటే పవన్‌కు ఎందుకు బాధ కలుగుతుందని.. కోర్టుల కంటే పవన్‌ గొప్పోడా? అని ప్రశ్నించారు.

Advertisement

కొండలపై ఏం కట్టొద్దని పవన్ కల్యాణ్‌ అజ్ఞానంగా మాట్లాడుతున్నారని.. అలాంటప్పుడు చిరంజీవి, పవన్‌కల్యాణ్‌ల‌ ఇళ్లు బంజారాహిల్స్‌లో కొండల మీద ఉన్నాయి కదా అని నిలదీశారు రోజా. బోడి వెధవలు, బోడి ప్రచారం చేయడం ఫ్యాషన్‌గా మారిపోయిందని మండిపడ్డారు. సీఎం జగన్‌కు ఏపీలో ముందునుంచే ఇల్లు ఉందని.. అయినా ఆయనకు ఎన్ని ఇళ్లు ఉంటే పవన్‌కు ఎందుకన్నారు రోజా.

పవన్‌ చంద్రబాబుకు బానిసని.. బాబు ఇచ్చే ప్యాకేజీ కోసం పని చేస్తుంటాడని.. ఆ ఇద్దరికీ ఏపీలో కనీసం ఇల్లు కూడా లేదంటూ రోజా కౌంటర్లు వేశారు. నిలదీయాలనుకుంటే చంద్రబాబు అవినీతి గురించి నిలదీయాలని..
కరకట్ట అక్రమ నిర్మాణం, గీతం వర్సిటీ కబ్జాల గురంచి ప్రశ్నించాలని పవన్‌ను సవాల్ చేశారు మంత్రి రోజా. పవర్‌స్టార్‌ కాదు.. ప్యాకేజీ స్టార్‌.. పవన్ కల్యాణా.. పనికిమాలిన కళ్యాణా.. అంటూ ఫైర్ అయ్యారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×