E-Paper
Advertisement

Nara Lokesh: సార్.. నన్ను కాపాడండి, ‘బిగ్ టీవీ’ ట్వీట్‌పై మంత్రి లోకేష్ రియాక్ట్, మహిళకు సాయం

Nara Lokesh: సార్.. నన్ను కాపాడండి, ‘బిగ్ టీవీ’ ట్వీట్‌పై మంత్రి లోకేష్ రియాక్ట్, మహిళకు సాయం
Advertisement

West Godavari News: నిజాలు వెలికి తీయడంలో ‘బిగ్ టీవీ’ ఎల్లప్పుడూ ముందు ఉంటుంది. ఈ విషయంలో ఎవరేమనుకున్నా పట్టించుకోదు. ప్రజలు కూడా ఛానెల్‌ని అదే విధంగా ఆదరిస్తున్నారు. అత్యంత ప్రజాధరణ పొందింది కూడా. తాజాగా బిగ్ టీవీ చేసిన ఓ ట్వీట్‌‌పై మంత్రి నారా లోకేష్ రియాక్ట్ అయ్యారు. గల్ఫ్‌లో చిత్రహింసలు అనుభవిస్తున్న ఓ మహిళ తన గోడు వెల్లబోసుకుంది. ఆమెని స్వదేశానికి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నట్లు ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు.

మస్కట్‌లో నరకం అనుభవిస్తున్న వెస్ట్ గోదావరి మహిళ

Advertisement

పశ్చిమ గోదావరికి చెందిన సంపూర్ణ గల్ఫ్‌కు వెళ్లాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో ఓ ఏజెంట్‌ని సంప్రదించింది. మాయమాటలు చెప్పి ఆమెని మస్కట్‌ పంపాడు సదరు ఏజెంట్. అక్కడికి వెళ్లిన తర్వాత ఆమెకి తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. ప్రతీ రోజు అక్కడ ఆమె నరక యాతన అనుభవిస్తోంది.

ఈ విషయమై బాధిత మహిళ మస్కట్ నుంచి నేరుగా ‘బిగ్ టీవీ’ని ఆశ్రయించింది. ఏజెంట్ మాయమాటలు నమ్మి గల్ఫ్‌కు వచ్చానని తెలిపింది. మస్కట్ వచ్చిన తర్వాత తనకు పూర్తిగా అర్థమైందని, ప్రతీరోజు తనను చిత్రహింసలు పెడుతున్నారని గోడు వెల్లబోసుకుంది. ఏజెంట్ల మాటలు నమ్మి తన పిల్లలను హాస్టల్‌లో జాయిన్ చేసి మస్కట్ వచ్చానని కన్నీరు మున్నీరు అయ్యింది.

Advertisement

బిగ్ టీవీని ఆశ్రయించిన మహిళ, మంత్రి లోకేష్ సాయం

తాను పడుతున్న ఇబ్బందులను వివరించింది. తన భర్త తాగుబోతని, పిల్లలను తన తల్లికి అప్పగించి వచ్చారని, ఇక్కడకు వచ్చిన తర్వాత ప్రతీరోజు తనకు ఏడాది మాదిరిగా గడుస్తోందని తెలిపింది. ఈ విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్ తనను కాపాడాలని కోరింది బాధిత మహిళ.

ఎలాగైనా తనను స్వదేశానికి రప్పించాలని వేడుకుంది బాధితురాలు. ఆమె మాట్లాడిన వీడియోపై ఎక్స్ వేదికగా ‘బిగ్ టీవీ’ ట్వీట్ చేసింది. దీనిపై మంత్రి నారా లోకేష్ రియాక్ట్ అయ్యారు. ‘సంపూర్ణ గారు ఓ ఏజెంట్ చేతిలో మోసపోయి మస్కట్‌లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిసి ఆందోళన చెందుతున్నట్లు రాసుకొచ్చారు. అలాంటి వారిని నిస్సహాయంగా వదిలి వేయకూడదు, ఈ విషయాన్ని సంబంధిత అధికారుల దృష్టికి వెంటనే తీసుకెళ్లి ఆమెని త్వరగా స్వదేశానికి తిరిగి తీసుకురావడానికి తనవంతు కృషి చేయాలని తన బృందాన్ని కోరాను. ఈ విషయంలో అవసరమైన సహాయం చేస్తామని, ఈ క్లిష్ట సమయంలో నా ఆలోచనలు ఆమె కుటుంబంతో ఉన్నాయన్నారు’.  మంత్రి నారా లోకేష్ స్పందించడంతో ఆ మహిళ ఆనందం వ్యక్తం చేసింది.

ALSO READ:  మన పురాణాల గురించి పిల్లలకు చెప్పాలన్న సీఎం చంద్రబాబు

 

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×