E-Paper
Advertisement

Visakhapatnam: క్యాప్ జెమిని సీఈవో ఐమాన్‌తో మంత్రి లోకేష్ భేటీ, రాష్ట్రంలో పెట్టుబడులపై కీలక చర్చ

Visakhapatnam: క్యాప్ జెమిని సీఈవో ఐమాన్‌తో మంత్రి లోకేష్ భేటీ, రాష్ట్రంలో పెట్టుబడులపై కీలక చర్చ
Advertisement

Visakhapatnam: పెట్టుబడులకు విశాఖ అనుకూలంగా ఉందన్నారు మంత్రి లోకేష్. ఈ ప్రాంతంలో గూగుల్ వంటి సంస్థలు డేటా సెంటర్లు పెడుతున్నాయని చెప్పారు. గురువారం విశాఖ వేదికగా క్యాప్ జెమిని గ్లోబల్ సీఈవో ఐమాన్‌తో మంత్రి నారా లోకేష్ సమావేశమయ్యారు. ఇరువురు మధ్య పెట్టుబడుల గురించి చర్చించారు.

క్యాప్ జెమిని సీఈవో ఐమాన్‌తో మంత్రి లోకేష్ భేటీ

Advertisement

ముఖ్యంగా విశాఖలో క్యాప్ జెమినీ సంస్థ ఏర్పాటుపై కూడా చర్చ జరిగింది. మధురవాడ ఐటీ పార్కులో 20 ఎకరాల భూమిని ఈ సంస్థ కోసం పరిశీలన చేసింది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ఆ కంపెనీ ప్రతినిధులు అడవివరం, ఆనందపురం ప్రాంతాల్లోని భూములను పరిశీలించారు కూడా. అయితే తాత్కాలిక కార్యకలాపాలకు సెంట్రల్ పార్కులోని ఓ భవానాన్ని ఎంపిక చేశారు.

సీఎం చంద్రబాబు నాయకత్వంలో విశాఖలో ఐటీ, డేటా సెంటర్ హబ్‌గా అభివృద్ధి చెందుతోందన్నారు. దేశంలో అతి పెద్ద గూగుల్ డేటా సెంటర్ పనులు త్వరలో ప్రారంభం కాబోతున్నట్లు తెలిపారు. ఇప్పటికే కాగ్నిజెంట్, టీసీఎస్ లాంటి సంస్థలు విశాఖలో ల్యాండ్ అయ్యాయని గుర్తు చేశారు. మరో మూడునెలల్లో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం  ప్రారంభం కాబోతోందన్నారు.

Advertisement

రాష్ట్రంలో పెట్టుబడులపై ఇరువురు మధ్య కీలక చర్చ

దేశంలో మరే ప్రాంతంలోని లేని ఐటీ ఎకో సిస్టమ్ విశాఖకు ఉందన్నారు. అన్నివిధాల అనుకూలతలు కలిగిన విశాఖలో 20వేల ఉద్యోగాలు కల్పించే సామర్థ్యం గల ఐటీ డెవలప్ సెంటర్, జీసీసీ, క్లౌడ్ సర్వీసెస్, బీపిఎం వర్టికల్స్ సేవల కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎమర్జింగ్ టెక్నాలజీ ల్యాబ్స్ ఏర్పాటు కోసం ఏపీ విశ్వవిద్యాలయాలతో కలిసి కో-డెవలప్ మెంట్ పార్టనర్‌గా వ్యవహరించాలని పేర్కొన్నారు.

క్యాప్ జెమిని డెడికేటెడ్ క్వాంటం వర్టికల్‌ను స్థాపించడమేగాక ఆప్టిమైజేషన్, ఫైనాన్సియల్ సర్సీసెస్, సస్టయినబిలిటీ వంటి రంగాల్లో కస్టమర్ సేవల అభివృద్ధికి ప్రపంచస్థాయి సాంకేతిక భాగస్వాములతో కలిసి పని చేయాలన్నారు.  రాజధాని అమరావతిలో క్వాంటం వ్యాలీ అభివృద్ధికి సహకారం అందించాలని మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు. ఈ భేటీలో క్యాప్ జెమినీ ఇండియా సీఈవో సంజయ్ చాకే, డబ్ల్యూఎన్ఎస్ గ్లోబల్ సీఈవో కేశవ్ మురుగేష్ కూడా ఉన్నారు.

ALSO READ: పార్టీ ఆవిర్భావ వేడుకలు.. జగన్ కీలక వ్యాఖ్యలు, దేశ రాజకీయాల్లో వైసీపీ మార్క్

 

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×