E-Paper
Advertisement

AP Gas supply status: రాష్ట్రంలో గ్యాస్ కొరత లేదు.. వదంతులు నమ్మవద్దు: మంత్రి నాదెండ్ల మనోహర్

AP Gas supply status: రాష్ట్రంలో గ్యాస్ కొరత లేదు.. వదంతులు నమ్మవద్దు: మంత్రి నాదెండ్ల మనోహర్
Advertisement

AP Gas supply status: అంతర్జాతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో రాష్ట్రంలో ఎల్పీజీ గ్యాస్ కొరత ఉందంటూ వస్తున్న వార్తలపై ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పందించారు. మంగళవారం ఉన్నతాధికారులతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌లో ఆయన గ్యాస్ నిల్వలు, సరఫరా తీరును సమీక్షించారు. రాష్ట్రంలో గృహ మరియు వాణిజ్య అవసరాలకు సరిపడా గ్యాస్ అందుబాటులో ఉందని ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అంతర్జాతీయ యుద్ధ వాతావరణం నెలకొన్నప్పటికీ మన రాష్ట్రంపై దాని ప్రభావం ప్రస్తుతానికి ఏమీ లేదని కేంద్ర ప్రభుత్వం కూడా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తోందని ఆయన పేర్కొన్నారు.

గృహ వినియోగదారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడటమే తమ ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత అని మంత్రి తెలిపారు. అవసరమైతే వాణిజ్య అవసరాలకు వాడే గ్యాస్‌ను ప్రాధాన్యత క్రమంలో కేటాయిస్తూ గృహ అవసరాలకు లోటు రాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. విశాఖపట్నం రిఫైనరీ అలాగే హస్సన్-చర్లపల్లి పైపులైన్ ద్వారా వస్తున్న సరఫరాను ఎప్పటికప్పుడు గమనిస్తున్నామని చెప్పారు. నిల్వల్లో స్వల్ప మార్పులు వచ్చినా వెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేలా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు.

Advertisement

బ్లాక్ మార్కెట్ నిరోధానికి ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. గ్యాస్ సిలిండర్లు పక్కదోవ పట్టకుండా జిల్లాల వారీగా ప్రత్యేక నిఘా బృందాలను ఏర్పాటు చేయాలని జాయింట్ కలెక్టర్లను మంత్రి ఆదేశించారు. కృత్రిమ కొరత సృష్టించి ధరలు పెంచే వారిపై లేదా పుకార్లు వ్యాప్తి చేసే వారిపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. సరఫరా గొలుసులో ఎక్కడైనా లోపాలు తలెత్తితే తక్షణమే వాటిని సరిదిద్దేలా రాష్ట్ర స్థాయి అధికారులు దృష్టి సారించాలని సూచించారు.

సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు సమాచారాన్ని చూసి ప్రజలు భయాందోళనకు గురికావొద్దని నాదెండ్ల మనోహర్ కోరారు. పౌరసరఫరాల శాఖ నిరంతరం చమురు కంపెనీలతో సంప్రదింపులు జరుపుతోందని నిల్వల విషయంలో ఎటువంటి లోటు లేదని పునరుద్ఘాటించారు. ఈ క్లిష్ట సమయంలో యంత్రాంగం మొత్తం ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందించాలని దిశానిర్దేశం చేశారు. వదంతులు నమ్మకుండా ప్రశాంతంగా ఉండాలని రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Advertisement

Read Also: తెలుగు వైభవం ఉట్టిపడేలా అమరావతి నిర్మాణం.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×