// // నా భవిష్యత్తు మీదే బాధ్యత.. రంపచోడవరం మెగా పేరెంట్-టీచర్ మీటింగ్‌‌లో మంత్రి లోకేష్ -->
E-Paper
Advertisement

నా భవిష్యత్తు మీదే బాధ్యత.. నో అడ్మిషన్ బోర్డులు పెట్టే రోజులొచ్చేశాయి- మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు

నా భవిష్యత్తు మీదే బాధ్యత.. నో అడ్మిషన్ బోర్డులు పెట్టే రోజులొచ్చేశాయి- మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
Advertisement

Rampa Chodavaram: మెగా పేరెంట్-టీచర్ మీటింగ్‌ లో మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. నా భవిష్యత్తు మీ బాధ్యతని అని అన్నారు. మీకు మంచి మార్కులు వస్తే.. నాకు మంచి మార్కులు వచ్చినట్టు అవుతుందన్నారు. ఏదైనా పొరపాటు జరిగితే సీఎం చంద్రబాబు తనను వదిలి పెట్టరని మనసులోని మాట బయట పెట్టారు.  అందుకే నా భవిష్యత్తు మీ బాధ్యత అని తెలియజేస్తున్నానని తెలిపారు.

నా భవిష్యత్తు మీదే బాధ్యత-మంత్రి లోకేష్ -శుక్రవారం మెగా పేరెంట్-టీచర్ సమావేశం రంప చోడవరంలో జరిగింది. దీనికి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ హాజరయ్యారు. అక్కడ ఏర్పాటు చేసిన వేదికపై అపూర్వ ఘట్టం ఆవిష్కృతమైంది. విద్యార్థులంతా తమ తల్లిదండ్రులకు పాదాభివందనం చేయాలని వేదికపై అనౌన్స్‌మెంట్ చేశారు.

Advertisement

పాఠశాలల ముందు నో అడ్మిషన్ బోర్డులు- వెంటనే విద్యాశాఖ మంత్రి  లోకేష్ పక్కనే ఉన్న తన తండ్రి, సీఎం చంద్రబాబు పాదాలకు నమస్కరించారు. తండ్రిపై తనకున్న ప్రేమాభిమానాలను అందరి ముందు చాటుకున్నారు.  ఆ తర్వాత మాట్లాడిన మంత్రి లోకేష్, తల్లికి వందనం కేవలం సంక్షేమ కార్యక్రమం కాదని, అందరినీ గౌరవించే కార్యక్రమన్నారు.

రంప చోడవరం మెగా పేరెంట్-టీచర్ సమావేశం- ఉపాధ్యాయులు-తల్లిదండ్రుల ద్వారా  ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం తీసుకొస్తానని ముఖ్యమంత్రి చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రభుత్వ పాఠశాల్లో చదివిన విద్యార్థులు మంచి మార్కులు సాధించారని, విద్యా వ్యవస్థను పటిష్టం చేయడమే మా బాధ్యతగా చెప్పుకొచ్చారు. విలువలతో కూడిన విద్య చాలా అవసరమన్నారు.

Advertisement

తన సొంత నియోజకవర్గం మంగళగిరిలో నిడమర్రులోని ఓ పాఠశాలను ఇంటర్నేషనల్ లెవెల్‌లో మార్చామని తెలిపారు. మంగళగిరిలో ఓ కార్యక్రమానికి వెళ్తే.. ఓ తల్లి నాతో గొడవకు దిగిందన్నారు. తనకు కూతురు ఉందని, ప్రభుత్వం పాఠశాలలో అడ్మిషన్ కావాలని కోరిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

ALSO READ: మనం పొత్తులో ఉన్నాం.. అన్ని పదవులు ఒకేసారి అడగలేం-మంత్రి నాదెండ్ల

ఎగ్జామ్‌లో మీ అమ్మాయి క్వాలిఫై అయితే హెచ్ ఎం తీసుకుంటారని చెప్పానన్నారు. ఈ తరహా పాఠశాలలను ప్రతీ నియోజకవర్గానికి ఒకటి తీసుకురావాలని ఆలోచన చేస్తున్నట్లు వివరించారు. తల్లిదండ్రలు, ఉపాధ్యాయుల నుంచి ఆశీస్సులు, వారిని గౌరవించాలని, చెప్పిన మార్గంలో నడవాలన్నారు.

గిరిజన ప్రాంతంలో సుమారు 200 ప్రభుత్వ పాఠశాలలకు 200 భవనాలు లేవన్నారు. రేకుల షెడ్లు కిందట పాఠాలు చెబుతున్న సందర్భాలు ఉన్నాయని, రాబోయే 12 నెలల్లో ప్రభుత్వం పాఠశాలలకు పర్మినెంట్ భవనాలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×