E-Paper
Advertisement

Amaravati: అమరావతి.. సారీ బ్రో- ఆ పనులు ఆగలేదు, ఆపై మంత్రి లోకేష్ వీడియో విడుదల

Amaravati:  అమరావతి.. సారీ బ్రో- ఆ పనులు ఆగలేదు, ఆపై మంత్రి లోకేష్ వీడియో విడుదల
Advertisement

Amaravati: ఆంధ్రప్రదేశ్ రాజాధాని అమరావతి పనులు ఎంతవరకు వచ్చాయి? వర్షాకాలం సీజన్ మొదలైంది. తెలంగాణతోపాటు ఏపీలోనూ వివిద ప్రాంతాల్లో భారీగా వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి లోకేష్.. రాజధాని అమరావతిలో జరుగుతున్న పనుల వీడియో విడుదల చేశారు.

అమరావతి.. సారీ బ్రో- ఆ పనులు ఆగలేదు

Advertisement

ఏపీ రాజధాని అమరావతి నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఓ వైపు వర్షంలో పడుతున్నా పనులు ఏ మాత్రం ఆగలేదు. రాజధాని పనులు ఆగిపోయాయని, చిన్న వర్షానికి మునిగిపోతోందని కొందరు చేస్తున్న విష ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు నిర్మాణ పనుల పురోగతిని చూపిస్తూ ఎక్స్ వేదికగా ఓ వీడియో పోస్ట్ చేశారు మంత్రి లోకేష్.

రాజధానిలో ఐకానిక్ టవర్లు, అసెంబ్లీ, హైకోర్టు, ప్రధాన రహదారులు, రిజర్వాయర్ల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వీటితోపాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం నిర్మిస్తున్న టవర్ల పనులు జరుగుతున్నాయి. మంత్రుల బంగ్లాల నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. ఇకనైనా విష ప్రచారాన్ని ఆపండి అంటూ ఓ వీడియోను విడుదల చేశారు. అక్కడ క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులను ప్రజల ముందు ఉంచారు.

Advertisement

మంత్రి లోకేష్ వీడియో విడుదల

అమరావతిలోని జీఏడీ టవర్ దేశంలో అత్యంత ఎత్తైన భవనాలలో ఒకటిగా మారనుంది. ప్రస్తుతం దక్షిణ భారతంలో అత్యంత ఎత్తైన భవనంగా హైదరాబాద్‌లోని ‘SAS Crown’ మాత్రమే ఉంది. సుమారు 236 మీటర్లు కాగా అమరావతిలో GAD టవర్ సుమారు 218 మీటర్ల ఎత్తులో నిర్మించనున్నారు. GAD టవర్ 17.03 లక్షల చదరపు అడుగులు కాగా, జీ ప్లస్ 49 అంతస్తుల భవనం. SAS Crown భవనం జీ ప్లస్ 59 అంతస్తులుగా ఉంది.

 

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×