E-Paper
Advertisement

AP Assembly Session-2026: ఏపీ వాట్సాప్ సర్వీసుల్లో ఏఐ కూడా.. క్లారిటీ ఇచ్చిన మంత్రి లోకేష్

AP Assembly Session-2026: ఏపీ వాట్సాప్ సర్వీసుల్లో ఏఐ కూడా.. క్లారిటీ ఇచ్చిన మంత్రి లోకేష్
Advertisement

AP Assembly Session-2026: ఏపీలో వాట్సాప్ సర్వీసుల్లో ఏఐ ఉపయోగించినట్టు మంత్రి లోకేష్ వివరించారు. ప్రభుత్వ సేవలు ప్రజలకు అందడంలో కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నట్లు సభ్యులు ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై మంత్రి లోకేష్ క్లారిటీ ఇచ్చారు. కొంత రీఇంజనీరింగ్ ప్రాసెస్ జరగాలన్నారు.

ఏపీ వాట్సాప్ సర్వీసుల్లో ఏఐ 

Advertisement

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాట్సాప్ ద్వారా ప్రభుత్వ సేవలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా సమయం ఆదా కావడం, అవినీతికి కట్ట వేయడం, పరిపాలనలో పారదర్శక కోసం తీసుకొచ్చింది. దీని ద్వారా కోటి 53 లక్షలు మంది సర్వీసుని వినియోగిస్తున్నారు. సర్వీసులు వినియోగించే సమయంలో కొన్ని సమస్యలు తలెత్తున్నాయి.

ఈ విషయాన్ని శుక్రవారం అసెంబ్లీలో ప్రస్తావించారు బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి. ఒకప్పుడు సేవా ద్వారా 270 సర్వీసులు, సచివాలయంలో 370 సేవలు ప్రజలకు అందేవని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన మిత్ర వాట్సాప్ ద్వారా 920 సేవలు అందుబాటులోకి వచ్చాయన్నారు.  కాకపోతే మిగతా యాప్‌ల పని చేయలేదంటూ ప్రభుత్వం దృష్టికి తెచ్చారు.

Advertisement

అసెంబ్లీలో క్లారిటీ ఇచ్చిన మంత్రి లోకేష్

కొన్ని సేవల్లో అంతరాయం ఏర్పడుతున్న విషయాన్ని వివరించారు. సభ్యులు లేవనెత్తిన అంశాలపై మంత్రి లోకేష్ క్లారిటీ ఇచ్చారు. ఏపీలో మన మిత్ర ద్వారా 95523 00009 వాట్సాప్ నుంచి 943 సర్వీసులను అందిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ప్రస్తుతం కోటి 43 లక్షలు ఈ సర్వీసును వినియోగిస్తున్నారని చెప్పారు. సర్వీసు ఎలా ఉందనే దానిపై వినియోగదారుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

కరెంటు బిల్లు కట్టే విషయంలో ప్రతీసారి డీటేల్స్ ఇవ్వాలన్నారు.  మిగతా యాప్‌ల మాదిరిగా నెంబర్ టైప్ చేస్తే వివరాలు వచ్చేలా ఆలోచన చేస్తామన్నారు. దీనికోసం కొంత రీఇంజనీరింగ్ ప్రాసెస్ జరగాలన్నారు సదరు మంత్రి.  అందులో ఏఐని ఇంటిగ్రేట్ చేసినట్టు తెలిపారు. వాట్సాప్ సర్వీసులకు సంబంధించి ఎలాంటి డేటా స్టోర్ చేయడం లేదన్నారు. సభ్యులు మనమిత్ర వాట్సాప్ వాడి ఫీడ్‌ బ్యాక్ ఇస్తే అమలు చేస్తామన్నారు. వేగంగా స్పందించడం, రసీదు రావాలనే అంశాలపై దృష్టి సారిస్తామని చెప్పుకొచ్చారు. అంతేకాదు మనమిత్ర 2.0ను ప్రారంభించాలని భావిస్తున్నట్లు వెల్లడించారు.

ALSO READ: వైకల్యాన్ని ఓడించిన సంకల్పం.. కార్తీక్ స్ఫూర్తిగాథ.. మేటరేంటంటే!

డోర్ టు డోర్ ప్రచారం చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు మంత్రి. యూజర్ ఫ్రెండ్లీ కోసం ఏఐని యాడ్ చేసినట్టు తెలిపారు. డేటా అనేది యూజర్ వద్ద ఉంటుందన్నారు. లేకుంటే డిపార్టుమెంట్ వద్ద ఉంటుందన్నారు.  ప్రస్తుతం కోటి 43 లక్షల మంది ఈ సర్వీసుని వినియోగిస్తున్నారని తెలిపారు.  సర్వీసు ఎలా ఉందనే దానిపై వినియోగదారుల నుంచి కచ్చితమైన ఫీడ్ బ్యాక్ తీసుకుని ఆ విధంగా ముందుకు వెళ్తున్నట్లు వివరించారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×