E-Paper
Advertisement

మోదీతో లోకేష్ భేటీ.. అమరావతి చట్టబద్ధత కృతజ్ఞతలు, భుజం తట్టి ప్రోత్సహించిన ప్రధాని

మోదీతో లోకేష్ భేటీ.. అమరావతి చట్టబద్ధత కృతజ్ఞతలు,  భుజం తట్టి ప్రోత్సహించిన ప్రధాని
Advertisement

Minister Lokesh: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంట్‌లో బిల్లుకు ఆమోద ముద్ర వేసినందుకు ప్రధాని నరేంద్రమోదీకి మంత్రి లోకేశ్ కృతజ్ఞతలు తెలిపారు. గురువారం ఉదయం ఢిల్లీలో ఎన్డీయే ఎంపీలతో కలిసి ప్రధానిని కలిశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి శాలువా కప్పి ప్రజల తరఫున ధన్యవాదాలు తెలిపారు.

మోదీతో లోకేష్ భేటీ.. అమరావతి చట్టబద్ధత కృతజ్ఞతలు

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంటు ఉభయసభల్లో కేంద్రం ఏపీ పునర్విభజన బిల్లు పెట్టింది. ఆ బిల్లు బుధవారం లోక్‌సభలో పాసైంది. గురువారం రాజ్యసభలో ఆ బిల్లుపై చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ ఉదయం ఢిల్లీ వెళ్లారు మంత్రి లోకేష్. ప్రధాని నరేంద్రమోదీతో ఆయన భేటీ అయ్యారు. అమరావతికి చట్టబద్ధత కల్పించినందుకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ సందర్భంగా ప్రధానితో లోకేష్ కీలక విషయాలు ప్రస్తావించినట్టు తెలుస్తోంది. వైసీపీ వ్యవహారశైలి గురించి వివరించినట్టు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఓ వైపు లోక్‌సభలో బిల్లుపై చర్చ జరుగుతున్న సందర్భంలో జగన్ చేసిన పనిని ప్రధాని దృష్టికి తెచ్చినట్టు తెలుస్తోంది. సభలో అన్నిపార్టీలు రాజధాని అమరావతికి మద్దతు ఇచ్చాయని, వైసీపీ సభ్యులు వాకౌట్ అయిన సందర్భంగా గుర్తు చేసినట్టు తెలుస్తోంది.

Advertisement

పావు గంటపాటు ప్రధాని మోదీతో వివిధ అంశాలపై చర్చ

ప్రధానితో భేటీ అయిన ఫోటోలను ఎక్స్‌లో పోస్ట్ చేశారు మంత్రి లోకేష్. అమరావతి కోసం తమ భూములను త్యాగం చేసి ఏళ్ల తరబడి నిలబడిన రైతుల అసాధారణ గాథను ప్రధానికి వివరించానని రాసుకొచ్చారు. వారి త్యాగాలను గౌరవిస్తూ అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా నిర్మించేందుకు మార్గనిర్దేశం కోరినట్టు వెల్లడించారు.

ఆ తర్వాత పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజును కలిశారు మంత్రి నారా లోకేష్. అమరావతికి చట్టబద్ధత కల్పించడానికి సహకరించినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఆ తర్వాత లోకేశ్ మిగతా ఎంపీలు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి బిల్లు ఆమోదానికి సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. లోకేశ్‌ వెంట కేంద్రమంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని టీడీపీ, జనసేన, బీజేపీ ఎంపీలు ఉన్నారు.

ALSO READ: అమరావతిపై వెనక్కి తగ్గిన జగన్?.. అందుకోసమేనా? 

 

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×