E-Paper
Advertisement

Minister Lokesh: బయటకు చెప్పిన మంత్రి లోకేష్.. వారి భవిష్యత్ కోసమే, రేపో మాపో నిర్ణయం

Minister Lokesh: బయటకు చెప్పిన మంత్రి లోకేష్..  వారి భవిష్యత్ కోసమే, రేపో మాపో నిర్ణయం
Advertisement

Minister Lokesh: సొసైటీలో సెల్‌ఫోన్ వినియోగం రోజురోజుకూ పెరుగుతోంది. ఎక్కడ చూసినా చిన్నారులు, పెద్దల చేతుల్లో స్మార్ట్ ఫోన్లు దర్శనమిస్తున్నాయి. మొబైల్ ఉపయోగం వల్ల మంచి-చెడు రెండూ ఉంటాయి. తేడా వస్తే మనిషి జీవితం సర్వనాశనం ఖాయం. దీనిపై టెక్ నిపుణులు పదేపదే హెచ్చరిస్తుంటారు. ఈ నేపథ్యలో మనసులోని మాట బయటపెట్టారు మంత్రి నారా లోకేష్.

చిన్నారుల సోషల్ మీడియాపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు

Advertisement

ఏపీకి పెట్టుబడులు రప్పించడం కోసం దావోస్‌కి వెళ్లారు మంత్రి లోకేష్. టెక్నాలజీ పరంగా వస్తున్న మార్పులు, సొసైటీ జరుగుతున్న నేరాలను గమనించారు ఆయన. ఈ క్రమంలో బ్లూమ్‌బర్గ్‌తో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. కొన్ని విషయాలను బయటపెట్టారు. ఏపీలో చిన్నారులకు సోషల్‌ మీడియా బ్యాన్‌‌పై స్టడీ చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు మంత్రి నారా లోకేశ్. ‌

ఒక వయస్సు కంటే తక్కువున్న యువతీయువకులు అలాంటి ప్లాట్‌ఫామ్‌లలో ఉండకూడదన్నారు. వారు బహిర్గతం చేసే కంటెంట్‌‌ని పూర్తిగా అర్థం చేసుకోలేరన్నారు. ఆ దిశగా తాము ఆలోచిస్తున్నట్లు మనసులోని మాట బయటపెట్టారు. ఈ విషయంలో బలమైన చట్టాలను రూపొందించాల్సిన అవసరం ఉందని తాను నమ్ముతున్నట్లు తెలిపారు.

Advertisement

స్టడీ చేస్తున్నామని మంత్రి వెల్లడి

దేశంలో ఇప్పటికే మైనర్లు సోషల్ మీడియాను యాక్సెస్ చేయడానికి తల్లిదండ్రుల నుంచి నియంత్రణ ఉంది. ఈ విషయంలో కేంద్రం ఇంకా ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయలేదని  అన్నారు. ఆ తరహా నిషేధం విధిస్తే దేశంలోనే ఏపీ మొదటి రాష్ట్ర అవుతుంది.

రెండేళ్ల కిందట ఆస్ట్రేలియాలో 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియాను విస్తారంగా వినియోగించడంపై అక్కడి ప్రభుత్వం నిషేధం విధించింది. గత డిసెంబర్‌లో అల్బనీస్ ప్రభుత్వం 16 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు TikTok, X, Facebook, Instagram, YouTube, Snapchat వంటి ప్రధాన సోషల్ మీడియా సేవలను ఉపయోగించకుండా నిషేధించింది.

ALSO READ: ఏపీ లిక్కర్ స్కామ్.. నిన్న సాయిరెడ్డి, నేడు మిథున్‌రెడ్డి, రేపు ఎవరికి నోటీసులు?

ఈ నిషేధం కింద పిల్లలు కొత్త ఖాతాలను ఏర్పాటు చేయలేరు. ఇప్పటికే ఉన్న వారి ఖాతాలను తొలగిస్తున్నారు. అంతర్జాతీయ నివేదికల ప్రకారం.. దీనివల్ల ఆస్ట్రేలియాలో మిలియన్ల కొద్దీ టీనేజ్ ఖాతాలు తొలగించింది. 10 నుంచి 15 సంవత్సరాల వయస్సు గల పిల్లలు 96 శాతం సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నారని తేలింది. వారిలో 70 శాతం స్త్రీ ద్వేషపూరిత,హింసాత్మక కంటెంట్‌కు గురయ్యారని చెబుతున్నాయి.

నిజానికి యూకెతోపాటు అనేక దేశాలు ఆస్ట్రేలియా విధించిన నిషేధాన్ని అన్వేషణ మొదలుపెట్టాయి. జనవరి మొదటివారంలో యూకెలోని ఎగువ సభ 16 ఏళ్లలోపు వారు సోషల్ మీడియా ఉపయోగించకుండా నిషేధించడానికి అనుకూలంగా ఓటు వేశారు. ఆస్ట్రేలియా చట్టం నిషేధాన్ని ఉల్లంఘించినందుకు తల్లిదండ్రులు లేదా పిల్లలను శిక్షించదు. అందుకు బదులుగా ఉల్లంఘనలకు పాల్పడిన సోషల్ మీడియా కంపెనీలకు మిలియన్ల కొద్దీ జరిమానా విధించనుంది.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×