E-Paper
Advertisement

Minister Ravi Kumar: ఈ పాపం జగన్‌దే.. వైసీపీ పోరుబాటపై మంత్రి గొట్టిపాటి కౌంటర్

Minister Ravi Kumar:  ఈ పాపం జగన్‌దే..  వైసీపీ పోరుబాటపై మంత్రి గొట్టిపాటి కౌంటర్
Advertisement

Minister Ravi Kumar: ఏపీలో పెరిగిన విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ పోరుబాటకు సిద్ధమైంది వైసీపీ. డిసెంబర్ 27న ఏపీ అంతటా నిరసన తెలపనుంది. నియోజకవర్గాల్లో విద్యుత్ కేంద్రాల అధికారులకు వినతి పత్రం ఇవ్వనున్నారు పార్టీ నేతలు. ఈ వ్యవహారంపై నోరు విప్పారు విద్యుత్ శాఖమంత్రి గొట్టిపాటి రవికుమార్. వైసీపీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

విద్యుత్ చార్జీలు పెరగడానికి కారణం మాజీ సీఎం జగన్ రెడ్డి కాదా అంటూ ప్రశ్నించారు మంత్రి. విద్యుత్ ఛార్జీలను వాళ్లే పెంచారని, మళ్లీ వారే ధర్నాకు పిలుపు నివ్వడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రపంచంలో ఆ తరహా వింత పోకడ ఎక్కడా చూడలేదన్నారు. ధర్నా చేయాల్సింది కలెక్టరేట్ల వద్ద కాదని, జగన్ ఇంటి ముందు చేస్తే బాగుండేదన్నారు.

Advertisement

జగన్  ఆందోళనకు పిలుపు నివ్వడం విడ్డూరంగా ఉందన్నారు గొట్టిపాటి రవికుమార్. ట్రూఆప్ ఛార్జీలు పెంపు ముమ్మాటికీ జగన్ పాపమేనన్నారు. పదవి నుంచి దిగే పోయే ముందు ప్రజలపై విద్యుత్ భారం మోపారన్నారు. రేట్ల పెంపుపై ఈఆర్‌సీకి ఎవరు సిఫార్సు చేశారని ప్రశ్నించారు.

ఈ విషయాలన్నీ ప్రజలకు తెలుసన్నారు. 2019లో మిగులు విద్యుత్ రాష్ట్రంగా జగన్‌కు అప్పగిస్తే, 2024 నాటికి సర్వనాశనం చేశారన్నారు. కావాల్సినవారికి దోచి పెట్టేందుకు అధిక ధరలతో విద్యుత్ కొనుగోలు చేశారన్నారు.

Advertisement

ALSO READ:  పరకామణి ఇష్యూ.. 200 కోట్లు, ఆపై సెటిల్‌మెంట్

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×