E-Paper
Advertisement

Minister Anitha: జగన్ సినిమాలో పస లేదు: మంత్రి అనిత

Minister Anitha: జగన్ సినిమాలో పస లేదు: మంత్రి అనిత
Advertisement

Minister Anitha: వైసీపీ అధినేత జగన్ బుధవారం ఢిల్లీలో చేసిన ధర్నాపై ఏపీ హోం మంత్రి అనిత సెటైర్లు వేసారు. అధి ధర్నా కాదు డ్రామా అంటూ వ్యాఖ్యానించారు. కూటమి అధికారంలోకి వచ్చిన 45 రోజుల్లోనే 36 మంది వైసీపీ కార్యకర్తలు రాజకీయ హత్యల కారణంగా చనిపోయారని చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. ఒక వేళ 36 మంది రాజకీయ హత్యలతో నిజంగానే చనిపోతే జగన్ ఒక్కరిని మాత్రమే ఎందుకు పరామర్శించారని అన్నారు. 36 మంది వివరాల జాబితాను ఇవ్వాలని సూచించారు.

రాజకీయ కక్షల వల్ల నలుగురు చనిపోయారని అందులో ముగ్గురు టీడీపీకి చెందిన వారే అని అన్నారు. ఢిల్లీలో ధర్నా చేస్తున్న జగన్‌కు ఎన్డీయే నాయకులు ఎవరూ మద్దతు ఇవ్వలేదని , కేవలం జగన్ పాలనలో జరిగిన విధ్వంసాన్ని తెలియని వారే మద్దతిచ్చాని అన్నారు. ధర్నాను చూస్తుంటే కేవలం సినిమా సెట్టింగ్ మాదిరిగానే ఉందని, కానీ జగన్ సినిమాలో మాత్రం అస్సలు పస లేదని ఎద్దేవా చేశారు.

Advertisement

ఏ రాజకీయ పార్టీ అయినా సిద్ధాంతంతో నడుస్తుంది. కానీ ఏపీలో ఫేక్ రాజకీయం. ఫేక్ ప్రచారం మాత్రమే కొనసాగుతోంది. ఇంకా అధికారంలో ఉన్నామనే భ్రమలో ఉంటూ అబద్ధపు ప్రచారాల వైసీపీ నేతలు చేస్తున్నారు. వై నాట్ 175 కి 11 సీట్లు కూడా తెచ్చుకోలేదు. అసెంబ్లీ సమావేశాలు ఎగ్గొట్టాలనే ఉద్దేశంతో ధర్నాలు చేస్తున్నారు. గతంలో ప్రతిపక్షాలపై నోటికొచ్చినట్టు మాట్లాడారు. ఢిల్లీలో తుగ్లక్ రెడ్డి ధర్నా చేయడం సిగ్గుచేటుగా ఉంది. జగన్‌కు భయం పట్టుకుంది. ఢిల్లీ వెళ్లి అక్కడ కూడా రెడ్ బుక్ గురించి మాట్లాడుతూనే ఉన్నారు.

Also Read:‘రాజకీయ నేతలు తప్పు చేస్తే శిక్షలు ఉండవా..?’

Advertisement

ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రతిపక్ష సభ్యుడిగా హుందాగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. బడ్జెట్‌లో రూ. 15 వేల కోట్లు ఏపీకి ఇచ్చినందుకు ఢిల్లీ వెళ్లిన జగన్ ప్రధాని మోడీకి ధన్యవాదాలు చెప్పాల్సి వుంది. జగన్ ఢిల్లీలో ఫోటో ఎగ్జిబిషన్ పెట్టారు. గతంలో అనంతబాబు హత్య చేసి డోర్ డెలివరీ చేస్తే అసెంబ్లీలో సేవ్ డెమోక్రసీ అనే ప్లకార్డులు పెట్టుకోవడం సిగ్గుచేటుగా ఉంది. అమరావతిలో మహిళా రైతులు ధర్నా చేస్తే ఆ ఫోటోలు పెట్టలేదు. గత ఐదేళ్లలో వైసీపీ చేసిన ఘటనలు ఎగ్జిబిషన్ పెడితే ఢిల్లీ సగం కూడా సరిపోదు. టీడీపీ హయంలో జరిగిన అన్ని హత్యలకు కూటమి కారణం అని అంటున్నారని మంత్రి అన్నారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×