E-Paper
Advertisement

Encounter: అల్లూరి జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్.. అగ్రనేత హిడ్మాతో పాటు ఐదుగురు మావోయిస్టుల మృతి..

Encounter: అల్లూరి జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్.. అగ్రనేత హిడ్మాతో పాటు ఐదుగురు మావోయిస్టుల మృతి..
Advertisement

Encounter: ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఉదయం 6 నుంచి 7 గంటల మధ్య ఈ కాల్పులు జరిగాయి. టైగర్ జోన్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు-భద్రతా బలగాల మధ్య తీవ్రమైన ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ప్రాంతం ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా సరిహద్దుల్లో ఉండటం వల్ల మావోయిస్టులకు ఆశ్రయం కల్పించే దట్టమైన అడవుల ప్రాంతం. అయితే మావోయిస్టు అగ్రనేతలు ఛత్తీస్‌గఢ్ సుక్మా జిల్లా నుంచి మారేడుమిల్లి వైపు వచ్చినట్లు ఇంటెలిజెన్స్ రిపోర్టులు అందాయి. దీని ఆధారంగా ఏపీ గ్రేహౌండ్స్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా సరిహద్దు భద్రతా బలగాలు కలిసి కూంబింగ్ ఆపరేషన్‌ను చేపట్టాయి. ఈ ఆపరేషన్‌లో పోలీసు బృందాలు, సెంట్రల్ ఫోర్సెస్ పాల్గొన్నాయి. ఎదురుపడిన మావోయిస్టులు తిరిగి కాల్పులు జరిపి పారిపోవడానికి ప్రయత్నించారు, కానీ తీవ్రమైన ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. భద్రతా బలగాలకు ఎలాంటి నష్టం లేదని అధికారులు తెలిపారు.

ఈ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టుల అగ్రస్థానికి చెందిన కేంద్ర కమిటీ సభ్యుడు, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ బెటాలియన్ నెంబర్-1 కమాండర్ హిడ్మా మృతి చెందినట్లు చెందాడు. హిడ్మాపై రూ.1 కోటి రివార్డ్ ప్రకటించారు. అతను దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీలో కీలక వ్యూహాత్మకుడు, గెరిల్లా యుద్ధ నిపుణుడు. సుక్మా జిల్లా పూర్తూరి గ్రామానికి చెందిన హిడ్మా మురియా గిరిజనుల నుంచి వచ్చాడు. 10వ తరగతి పూర్తి చేసిన తర్వాత మావోయిస్టులతో చేరాడు. హిందీ, గోండీ, తెలుగు, కోయా, బెంగాలీ భాషల్లో ప్రవేశం కలిగి ఉన్నాడు. 2004-2024 మధ్య 27 మేజర్ దాడులకు మాస్టర్ మైండ్‌గా పనిచేశాడు.

Advertisement

అంతేకాకుండా హిడ్మాతో పాటు అతని భార్య హేమ రూ.50 లక్షల రివార్డ్‌, మరో నలుగురు అనుచరులు మృతి చెందారు. ఎన్‌కౌంటర్ స్థలంలో తుపాకులు, పేలుడు పదార్థాలు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికీ కాల్పులు కొనసాగుతున్నట్లు సమాచారం తెలిపారు. హెలికాప్టర్లు, డ్రోన్‌ల సహాయంతో మిగిలిన మావోయిస్టుల కోసం విస్తృత కూంబింగ్ జరుగుతోంది. మృతదేహాలను పోస్ట్‌మార్టమ్‌కు పంపారు, గుర్తింపు చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా అలర్ట్ ప్రకటించారు.

Also Read: శంషాబాద్‌లో తీవ్ర విషాదం.. భార్య మరణాన్ని తట్టుకోలేక భర్త ఆత్మహత్య..

Advertisement

ఈ ప్రాంతం మావోయిస్టులకు ముఖ్య ఆశ్రయం అని చెబుతున్నారు. అలాగే జూన్ 2025లో ఇక్కడే మరో ఎన్‌కౌంటర్‌లో గజర్ల రవి ఉదయ్, అరుణ్ వంటి నేతలు మృతి చెందారు. కేంద్ర హోం మంత్రి ఆదేశాల మేరకు ‘ఆపరేషన్ కాగర్’ కింద మావోయిస్టులపై చర్యలు తీవ్రతరం చేశారు. హిడ్మా మరణం మావోయిస్టులకు పెద్ద షాక్‌కు గురిచేస్తుంది.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×