E-Paper
Advertisement

Amaravati: సీఎం చంద్రబాబుకు మేనకాగాంధీ లేఖ.. దయచేసి ఆపండి, మారణకాండ గురించి మీరేమీ చేయలేరా?

Amaravati: సీఎం చంద్రబాబుకు మేనకాగాంధీ లేఖ.. దయచేసి ఆపండి, మారణకాండ గురించి మీరేమీ చేయలేరా?
Advertisement

Amaravati: సీఎం చంద్రబాబుకు కేంద్ర మాజీ మంత్రి మేనకాగాంధీ లేఖ రాశారు. ఆ లేఖలో కీలక అంశాలను ప్రస్తావించారు. ఈనెల 18, 19న శ్రీ తిరుపతి గంగమ్మ ఆలయం వద్ద జరిగే జంతు బలులను నిషేధించాలని అందులో ప్రస్తావించారు. దేశంలో అత్యంత దారుణమైన సామూహిక హత్యల్లో ఒకటిగా మారిందన్నారు.

సీఎం చంద్రబాబుకు మేనకాగాంధీ లేఖ

Advertisement

ఏటా ఆ ప్రాంతంలో జరుగుతున్న జంతు బలుల గురించి వందలాది మంది యువకులు, డాక్టర్లు, ప్రొఫెసర్లు వంటి నిపుణులు తనకు లేఖలు రాశారని గుర్తు చేశారు. వేలాది జంతువులను ఏ కారణం లేకుండా చంపుతున్నారని రాసుకొచ్చారు.

దేశంలోనే అత్యంత ఆధునిక, ముందుచూపు ఉన్న ముఖ్యమంత్రుల్లో మీరు ఒకరని ప్రస్తావిస్తూనే,  దీనిని ఆపడం మీకు సాధ్యం కాదా? అంటూ ప్రశ్న రైజ్ చేశారు. దేశంలోని దాదాపు ప్రతి రాష్ట్రం జంతు బలిని నిషేధించిందని ప్రస్తావించారు. ఉత్తర‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ వంటి కొన్ని రాష్ట్రాలు కఠినంగా వ్యవహరిస్తున్నాయని వివరించారు.

Advertisement

దయచేసి ఆపండి, మారణకాండ గురించి మీరేమీ చేయలేరా? అంటూ ప్రస్తావన

చివరకు కర్ణాటక దాదాపు అదేస్థాయిలోనే ఆంక్షలు విదించిందన్నారు. ఇది ముమ్మాటికీ హింసను ప్రోత్సహిస్తుందని, అది సమాజానికి చెడు తెస్తుందన్నారు. ఆలయానికి జంతు బలి కోసం వచ్చేవారిలో చాలామంది తాగి ఉంటారని, ఎవరూ దేవతకు నైవేద్యంగా చేయరన్నారు. ఎటువంటి పరిణామాలు లేకుండా హింసకు పాల్పడే అవకాశం లభిస్తుందన్నారు.

దయచేసి దీనిని ఆపమని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నానని తెలిపారు. జరగబోయే ఈ మారణకాండను యావత్ దేశం చూస్తోందని, దీనివల్ల దేశ యువత నుండి ప్రశంసలు మాత్రమే లభిస్తాయన్నారు. ఆలయాన్ని మరింత అందమైన ప్రదేశంగా అభివృద్ధి చేయడానికి మీరు నిధులు ఇవ్వవచ్చని వివరించారు.

ALSO READ: కూటమిని విడగొట్టేందుకు వైసీపీ స్కెచ్.. విజయ్‌ విక్టరీని చూపిస్తూ పవన్ టార్గెట్, ఇంతకీ అంబటి ఏమన్నారు?

జంతు బలులకు బదులుగా కొబ్బరికాయలను సమర్పించమని ప్రజలు కోరవచ్చని, కర్ణాటక అదే చేసిందన్నారు. సతీ సహగమనం, దొంగచాటు పోరాటాలు, కోడిపందాలు వాటిని రద్దు చేశారని ఆ లేఖలో రాసుకొచ్చారు. జూదం, మద్యం సేవించడం, ఇంట్లో తయారు చేసుకున్న మత్తు పదార్థాలు తీసుకోవడం వంటి పాత ఆచారాలు ఉన్నాయని, మనం వాటిని వ్యతిరేకిస్తున్నామని అన్నారు. మరి ఆమె లేఖపై ముఖ్యమంత్రి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×