E-Paper
Advertisement

Man killed Young Woman : ప్రేమోన్మాది ఘాతుకం.. యువతిని నరికి, ఆత్మహత్యాయత్నం

Man killed Young Woman : ప్రేమోన్మాది ఘాతుకం.. యువతిని నరికి, ఆత్మహత్యాయత్నం
Advertisement

Man killed Young Woman in Eluru : ఏలూరు జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఏలూరులోని సత్రంపాడులో ప్రేమోన్మాది.. తాను ప్రేమించిన యువతిపై కత్తితో దాడి చేశాడు. యువతి గొంతు కోయడంతో అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలిని ఎమ్మెర్సీ కాలనీకి చెందిన రత్న గ్రేస్ (27)గా గుర్తించారు. గ్రేస్ పై కత్తితో దాడి చేసిన అనంతరం ఏసురత్నం గొంతుకోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఏసురత్నం ను ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ఏసురత్నంది ముసునూరు గ్రామమని పోలీసులు తెలిపారు.

కాగా.. ఏసురత్నం 10వ తరగతి నుంచి తమ కూతురిని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని మృతురాలి తల్లి ఆరోపించింది. మూడురోజుల క్రితమే రత్నగ్రేస్ కు మరో వ్యక్తితో నిశ్చితార్థం జరిగింది. ఈ క్రమంలో ఒకసారి మాట్లాడాలని పిలిచిన ఏసురత్నం.. పెద్దలకు తెలియకుండా పెళ్లి చేసుకుందామని ఆమెపై ఒత్తిడి చేసినట్లు తెలుస్తోంది. అందుకు ఆమె ఒప్పుకోకపోవడంతోనే కత్తితో నరికి చంపినట్లు పోలీసులు భావిస్తున్నారు. స్థానికులు మాత్రం.. వాళ్లిద్దరూ ఏడాదిన్నర కాలంగా కలిసి బయటకు వెళ్తున్నారని మీడియాకు తెలిపారు.

Advertisement

Also Read : “నువ్వే నా ప్రాణం.. నువ్వు లేకపోతే ఉండలేనన్నాడు..” 14 పేజీల లేఖ రాసి యువతి సూసైడ్

రత్నగ్రేస్ స్థానికంగా ఉన్న సిద్ధార్థ స్కూల్ లో టీచర్ గా పనిచేస్తున్నట్లు చెప్పారు. పోలీసులకు ఘటనా స్థలంలో కొత్త చీర సహా ఇతర పెళ్లి సామాగ్రి లభించినట్లు తెలుస్తోంది. రత్నగ్రేస్ మృతదేహాన్ని పోలీసులు మార్చురీకి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఆ ప్రాంతమంతా రక్తంతో తడిసి ముద్దయింది.

Tags

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×