E-Paper
Advertisement

GST Relief To Farmers: జీఎస్టీ తగ్గింపుతో రైతులకు భారీ ఊరట.. వేటిపై ధరలు తగ్గనున్నాయంటే?

GST Relief To Farmers: జీఎస్టీ తగ్గింపుతో రైతులకు భారీ ఊరట.. వేటిపై ధరలు తగ్గనున్నాయంటే?
Advertisement

GST Relief To Farmers: జీఎస్టీ 2.0 సంస్కరణలతో రైతాంగానికి ఎంతో మేలు జరుగుతుందని వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీ రావు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. జీఎస్టీ పన్ను తగ్గింపుపై రైతులకు అర్థమయ్యే విధంగా ఈ నెల 30, అక్టోబర్ 1న జిల్లా, మండల, రైతు సేవాకేంద్రం స్థాయి వరకు వ్యవసాయ పనిముట్ల ప్రదర్శన అవగాహన సదస్సులు, ట్రాక్టర్ ర్యాలీలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

వ్యవసాయ రంగంలో

  • ఎరువులు, పురుగు మందులు, సూక్ష్మపోషకాలు, జీవ సంబంధమైన పురుగు మందులపై 12 శాతం నుంచి 5 శాతం వరకు జీఎస్టీ తగ్గింపు
  • ట్రాక్టర్ విడిభాగాలకు 18 శాతం నుండి 5 శాతం వరకు తగ్గింపు
  • వ్యవసాయ, అనుబంధ మత్స్య ,పశు సంవర్ధక రంగాలలో తయారీ, వాటి ఉత్పత్తులు, ఉప ఉత్పత్తులలోని మొత్తంగా 837 వస్తువులకు జీఎస్టీ 18 శాతం నుండి 5 శాతం వరకు తగ్గింపు

జీఎస్టీ 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గిన యంత్రాలు

  • ట్రాక్టర్లు (1800 సీసీ కంటే ఎక్కువ ఇంజిన్ సామర్థ్యం కలిగిన సెమీ ట్రైలర్లకు రోడ్ ట్రాక్టర్లు తప్ప)
  • ట్రాక్టర్ టైర్లు/ట్యూబ్లు
  • ట్రాక్టర్ భాగాలు (బ్రేకులు, గేర్బాక్స్, క్లచ్, చక్రాలు, స్టీరింగ్, రేడియేటర్, సైలెన్సర్, హైడ్రాలిక్స్, ఫెండర్లు/హుడ్)
  • హార్వెస్టర్లు/నూర్చే యంత్రాలు, వారి భాగాలు
  • నేల తయారీ(దున్నడం), సాగు యంత్రాలు
  • కోళ్ల పెంపకం/తేనెటీగల పెంపకం యంత్రాలు
  • స్ప్రింక్లర్లు/బిందు సేద్యం & నాజిల్లు
  • చేతి పంపులు
  • కంపోస్టింగ్ యంత్రాలు
  • వాహనాలు, మొబిలిటీ యంత్రాలు

దీపావళి వరకు

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీఎస్టీ 2.0 సంస్కరణలను రాష్ట్ర ప్రభుత్వం స్వాగతిస్తూ దేశంలోనే తొలిసారిగా శాసనసభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదించిందని ఢిల్లీరావు తెలియచేశారు. జీఎస్టీ తగ్గింపుపై రాష్ట్ర ప్రజలకు అవగాహన కల్పించేందుకు సదస్సులు నిర్వహించాలని సీఎస్ విజయానంద్ ఆదేశించారన్నారు. రాష్ట్ర ప్రజలకు పన్ను తగ్గింపునకు ముందు, తగ్గించిన తర్వాత గల వ్యత్యాసాన్ని వివరిస్తూ 25 సెప్టెంబర్ (దసరా)నుండి 19 అక్టోబర్ (దీపావళి) వరకు అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు తెలిపారు.

Advertisement

Also Read: AP Weather: అక్టోబర్ 1 నాటికి మరో అల్పపీడనం.. రేపు ఈ జిల్లాల్లో వర్షాలు.. ప్రాజెక్టుల్లో వరద ప్రవాహాలు

జీఎస్టీ మాసోత్సవం

జీఎస్టీ అవగాహన మాసోత్సవంలో వ్యవసాయ, అనుబంధ రంగాలకు సెప్టెంబర్ 30, అక్టోబర్ 1 తేదీలను కేటాయించారన్నారు. దీని ప్రకారం రాష్ట్రంలోని అన్ని జిల్లా, మండల, రైతు సేవా కేంద్రాల ద్వారా పన్ను తగ్గింపుపై అవగాహన కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రైతులను, లబ్ధిదారులను భాగస్వామ్యం చేయాలని ఆదేశించారు. అద్భుతమైన జీఎస్టీ-అద్భుతమైన పొదుపు అనే నినాదంతో రైతులకు మరింత చేరువ చేయాలని కోరారు.

Tags

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×