E-Paper
Advertisement

Amaravati Massive Fire: అమరావతిలో భారీ అగ్నిప్రమాదం.. హెచ్ఓడీ టవర్‌లో ఘటన, విచారణకు ఆదేశం

Amaravati Massive Fire: అమరావతిలో భారీ అగ్నిప్రమాదం.. హెచ్ఓడీ టవర్‌లో ఘటన, విచారణకు ఆదేశం
Advertisement

Amaravati Massive Fire: ఆంధ్రప్రదేశ రాజధానిలో ఏం జరుగుతోంది? ఎందుకు అగ్నిప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి? దీని వెనుక ప్రత్యర్థుల కుట్ర ఏమైనా ఉందా? అనుకోకుండా ఘటన జరిగిందా? అసలు రాజధాని అమరావతిలో ఏం జరుగుతోంది? ఇదే ప్రశ్న చాలామందిని వెంటాడుతోంది.

అమరావతిలో భారీ అగ్నిప్రమాదం

Advertisement

ఏపీ రాజధాని అమరావతి అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. రాయపూడిలో హెడ్ ఆఫ్ డిపార్ట్‌మెంట్ టవర్‌ వద్ద ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అయితే విపరీతంగా పొగ రావడంతో వాటిని అదుపు చేయడం సిబ్బందికి కాస్త కష్టంగా మారింది. ఈ ఘటన వెనుక అనుకోకుండా జరిగిందా? ఏదైనా కుట్ర కోణం ఉందా అనేదానిపై పోలీసులు దర్యాప్తులో నిమగ్నమయ్యారు.

ఏపీ రాజధాని అమరావతిలోని రాయపూడి సమీపంలో కార్యదర్శుల భవనం వద్ద గత రాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. రాజధాని నిర్మాణ పనులను మేఘా ఇంజినీరింగ్‌ కంపెనీ చేస్తోంది. ఏం జరిగిందో తెలీదుగానీ నిల్వ చేసిన పైపులకు నిప్పు అంటుకుంది. దీంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి.

Advertisement

హెచ్ఓడీ టవర్‌లో ఘటన, విచారణకు ప్రభుత్వం ఆదేశం

పరిస్థితి గమనించిన స్థానికులు, కంపెనీ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఓ వైపు పోలీసులు, మరోవైపు అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. రెండుమూడు గంటల తర్వాత మంటలను అదుపులోకి తెచ్చారు. ఘటన సమయంలో దట్టమైన పొగతో వ్యాపించడంతో మంటలను అదుపు చేయటం సిబ్బందికి కష్టంగా మారింది.

మెగా సంస్థకు చెందిన పైపులకు ఉద్దేశపూర్వకంగా నిప్పు పెట్టినట్టు ఆరోపణలు లేకపోలేదు. కొద్దిరోజుల కిందట వెలగపూడి సమీపంలో ఎల్‌అండ్‌టీ కంపెనీకి చెందిన కోట్లాది రూపాయల విలువ కలిగిన హెచ్‌డీపీఈ పైపులు ఈ విధంగా మంటల్లో చెలరేగాయి. ఆ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు దర్యాప్తుకు ఆదేశించారు.

ALSO READ: విశాఖలో ఇనార్బిట్ మాల్ ప్రారంభం.. యువతకు భారీగా ఉపాధి అవకాశాలు..

ఇంకా ఆ దర్యాప్తు ముగియక ముందే మరో ప్రమాదం చోటు చేసుకోవడం కలకలం రేపుతోంది. గుత్తేదారుల నిర్లక్ష్యం వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయనే వాదనలు లేకపోలేదు. అగ్నిప్రమాదానికి కచ్చితమైన కారణాన్ని నిర్ధారించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు సమగ్రమైన దర్యాప్తునకు ఆదేశించారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×