E-Paper
Advertisement

Madanapalle Girl Incident Case: మదనపల్లె చిన్నారి కేసు.. సోమవారం సాయంత్రం నుంచి ఏం జరిగింది?

Madanapalle Girl Incident Case: మదనపల్లె చిన్నారి కేసు.. సోమవారం సాయంత్రం నుంచి ఏం జరిగింది?
Advertisement

Madanapalle Girl Incident Case: సినిమా మాదిరిగా మదనపల్లె చిన్నారి కేసు అనేక మలుపులు తిరిగింది. బాలికపై అత్యాచారం, ఆపై హత్య జరిగింది. పరిస్థితి గమనించిన నిందితుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయాన్ని పోలీసులు స్వయంగా వెల్లడించారు. ఇంతకీ ఈ కేసులో అసలు ఏం జరిగింది? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..

వీరబల్లి మండనానికి చెందిన ఓ ఫ్యామిలీ దశాబ్దమున్నర కిందట మదనపల్లె టౌన్‌కి వచ్చింది. ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్న దంపతులకు ఇద్దరు పిల్లలు. భార్యాభర్తలిద్దరు వేర్వేరు పనులు చేస్తూ ప్రైవేటు పాఠశాలలో పిల్లలను చదివిస్తున్నారు. బాలిక రెండో తరగతి చదువుతోంది. సోమవారం పాఠశాలకు సెలవు కావడంతో ఇంటి వద్దనే ఉంది. ఎప్పటి మాదిరిగా భార్యాభర్తలు పనికి వెళ్లిపోయారు.

Advertisement

సోమవారం సాయంత్రం మహిళ తన ఇంట్లో ఉన్న తన తండ్రికి ఫోన్‌ చేసి పాప గురించి అడిగింది. చిన్నారి ఇంట్లో లేదని, ఆడుకోడానికి వెళ్లిందేమోనని చెప్పాడు. బాలిక ఇంటికి రాకపోవడంతో సాయంత్రం ఆరు గంటల సమయంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు బాలిక తల్లిదండ్రులు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు గాలింపు చేపట్టారు. అంతేకాదు బాలిక ఆచూకీ తెలిస్తే తెలపాలని స్థానిక వాట్సప్‌ గ్రూపుల్లో పోస్టు చేశారు.

అర్ధరాత్రి వరకు గాలింపు చేపట్టారు పోలీసులు. బాలిక ఎదురింట్లో ఉంటున్నాడు 30 ఏళ్ల కులవర్ధన్. అతడికి నేర చరిత్ర ఉందని తెలియడంతో అర్ధరాత్రి సమయంలో అతడి ఇంటికి వెళ్లారు. కులవర్ధన్‌ నిద్రపోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే కుల‌వర్ధన్‌తో బాలిక కనిపించిందని చిన్నారి తాత చెప్పడంతో మంగళవారం ఉదయం ఏడు గంటల సమయంలో కులవర్దన్ ఇంటికి వచ్చారు పోలీసులు.

Advertisement

అతడ్ని నిద్ర లేపిన పోలీసులు, వారిని బయటకు నెట్టి పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఇంట్లో వెతగ్గా ప్లాస్టిక్ డ్రమ్ములో చిన్నారి మృతదేహం కనిపించింది. అది చూసి ఒక్కసారిగా షాకయ్యారు పోలీసులు. అప్పటికి చిన్నారి విషయం తెలియడంతో ఆ ప్రాంత ప్రజలు అక్కడికి చేరుకున్నారు. నిందితుడ్ని తమకు అప్పగించాలని పోలీసులను అడ్డుకున్నారు.

పట్టణ ప్రజలు అందరూ కలిసి రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. ఈ విషయం తెలియగానే ఇన్‌ఛార్జ్ ఎస్పీ విశ్వనాథ్ అక్కడికి చేరుకుని బాధితులతో మాట్లాడారు. చిన్నారి మృతదేహం ఉన్న ఇంటికి వెళ్లారు. మంగళవారం సాయంత్రం ఆరున్నర గంటల సమయంలో మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం తర్వాత రాత్రి 8.30 గంటలకు బాలిక మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు.

బుధవారం ఉదయం మదనపల్లె శివారులోని కనసానివారిపల్లె చెరువులో యువకుడి మృతదేహం గుర్తించారు స్థానికులు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు, యువకుడి మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ నీచుడి డెడ్‌బాడీ మాకొద్దంటూ తల్లిదండ్రులు, బంధువులు దూరంగా ఉన్నారు. అతడితో తమకు ఎలాంటి సంబంధం లేదంటున్న కులవర్ధన్ సోదరి చెప్పేసింది.

మున్సిపల్ సిబ్బంది కులవర్ధన్ అంత్యక్రియలు చేసే ఛాన్స్ ఉంది. ఈ వ్యవహారంపై జిల్లా ఎస్పీ ధీరజ్ పూర్తి వివరాలు వెల్లడించారు. ఇంట్లో నుంచి పారిపోతున్న కులవర్దన్‌ను స్థానికులు పట్టుకున్నట్లు తెలిపారు. స్థానికులు అతడ్ని చంపేస్తారని భావించి రక్షక్ వాహనంలోని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో నిందితుడు అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాడని తెలిపారు.

మూడు బృందాలతో గాలింపు చేపట్టామని వివరించారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలీదుగానీ పట్టణ శివారులోని చెరువులో శవమై కనిపించాడని వెల్లడించారు. ఈ ఘటన నేపథ్యంలో తనకు ఇబ్బందులు తప్పవని భావించి కులవర్దన్ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. ఈ వ్యవహారాన్ని రాజకీయ చేసిన వారిపై కేసులు పెట్టామని, కఠిన చర్యలు తీసుకుంటామన్నారు జిల్లా ఎస్పీ.

 

 

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×