E-Paper
Advertisement

Madanapalle Files Burning Case Update: మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసు.. కీలక నిందితుడు అరెస్ట్, గుట్టు విప్పేనా?

Madanapalle Files Burning Case Update: మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసు.. కీలక నిందితుడు అరెస్ట్, గుట్టు విప్పేనా?
Advertisement

Madanapalle Files Burning Case Update: మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసు ఎంతవరకు వచ్చింది? ఘటన జరిగి ఆరునెలలు గడుస్తున్నా కేసు మాత్రం నత్తనడకగా సాగుతోందా? అరెస్టయిన గౌతమ్ తేజ్ గుట్టు విప్పేనా? తెరవెనుక సూత్రదారులు బయటకు వస్తారా? అదే జరిగితే వైసీపీ కీలక నేతల మెడకు ఉచ్చు బిగుసుకోవడం ఖాయమా? అవుననే సమాధానాలు వస్తున్నాయి.

మదనపల్లి ఫైల్స్ దహనం కేసులో సోమవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న సబ్ కలెక్టరేట్ సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ్‌ను చాకచక్యంగా పోలీసులు అరెస్ట్ చేశారు.

Advertisement

బంగారు పాళ్యం సమీపంలో గౌతమ్‌ని  అదుపులోకి తీసుకున్నారు సీఐడీ అధికారులు. ఆ వ్యవహారం బయటకు పొక్కకుండా జాగ్రత్తగా చర్యలు తీసుకున్నారు. అనంతరం నిందితుడ్ని కోర్టు ముందు హాజరుపరిచారు. అతడికి జనవరి 10 వరకు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు న్యాయమూర్తి. ఆ తర్వాత చిత్తూరు జైలుకి నిందితుడ్ని తరలించారు.

గౌతమ్ తేజ్‌ను కస్టడీకి తీసుకోవాలని భావిస్తోంది సీఐడీ. దీనికి సంబంధించి డీటేల్స్ రెడీ చేస్తున్నారు అధికారులు. గౌతమ్ నోరు విప్పితే ఈ కేసు ఓ కొలిక్కి రావచ్చని  అధికారుల అంచనా వేస్తున్నారు.  రేపో మాపో కస్టడీ పిటిషన్‌ను వేయాలని ఆలోచన చేస్తున్నారు.

Advertisement

ALSO READ:  ఏపీకి ఇది గేమ్ ఛేంజర్ అవుతోంది.. మీరే చూడండి: సీఎం చంద్రాబు

నిందితుడు గౌతమ్ తేజ్ ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే.. కారుణ్య నయామకం కింద ఉద్యోగం సంపాదించాడు. తొలుత చిత్తూరు కలెక్టరేట్‌లో పని చేశాడు. ఈ క్రమంలో అనేక ఆరోపణలు రావడంతో పలమనేరుకు బదిలీ చేశారు. ఆ తర్వాత మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయానికి బదిలీపై వచ్చాడు. రెండేళ్లుగా అక్కడే పని చేస్తున్నాడు.

మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసులో పత్రాలు దహనం వెనుక కీలకంగా మారాడు గౌతమ్ తేజ్. ఎందుకంటే ఘటన జరగడానికి ముందు ఏడు లీటర్లు ఇంజన్ ఆయిల్‌ను బీరువాలో భద్రపరిచాడు. మంటలకు ఇంజన్ ఆయిల్‌ తోడు అయ్యింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి.

ఆఫీసులో గౌతమ్ సీటు పక్కనే ఆల్మరాలో లక్షన్నరకుపైగా నగదు పోలీసులు సీజ్ చేశారు. అక్రమ వసూళ్లకు పాల్పడినట్టు అధికారుల విచారణలో తేలింది. ఈ పరిణామాల నేపథ్యంలో పైస్థాయి అధికారులు ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారు. ఇన్నాళ్లు పోలీసుల కళ్లు గప్పి తప్పించుకుని తిరిగాడు. ప్రస్తుతం చిత్తూరు జైలులో ఉన్నాడు.

పత్రాల దహనం కేసులో చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి అనుచరుల పాత్రపై సీఐడీ తీగ లాగితే డొంకంతా కదులుతోంది. మొత్తం 8 మందిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వారిలో మదనపల్లె మున్సిపల్ వైస్ ఛైర్మన్ చలపతి, గౌతమ్ తేజ్, పాత ఆర్డీవో మురళి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యక్తిగత కార్యదర్శి తుకారాంతోపాటు మరో నలుగురు వైసీపీ నేతలున్నారు. వీరి ఇళ్లు, ఆఫీసుల్లో సోదాలు చేసిన అధికారులకు పలు దస్త్రాలు లభించాయి. వాటి ఆధారంగా గౌతమ్‌ను విచారించే అవకాశముంది.

 

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×