E-Paper
Advertisement

Madan Mohan – Vijayasai Reddy: శాంతి ఉదంతం మళ్లీ తెరపైకి.. లోకేష్ కు మదన్ మోహన్ ఫిర్యాదు.. సాయిరెడ్డిపై కూడా..

Madan Mohan – Vijayasai Reddy: శాంతి ఉదంతం మళ్లీ తెరపైకి.. లోకేష్ కు మదన్ మోహన్ ఫిర్యాదు.. సాయిరెడ్డిపై కూడా..
Advertisement

Madan Mohan – Vijayasai Reddy: వైసీపీ నేత, ఎంపీ విజయసాయిరెడ్డి విషయం ఇప్పుడు నేరుగా మంత్రి నారా లోకేష్ చెంతకు చేరింది. అది కూడా ప్రజాదర్బార్ లో వినతిపత్రం అందగా, అక్రమాలకు పాల్పడ్డ ఎవరినీ వదిలిపెట్టేది లేదంటూ లోకేష్ హామీ ఇచ్చారు. ఇంతకు ఈ వినతిపత్రం ఇచ్చింది ఎవరో తెలుసా.. సస్పెండ్ కు గురైన దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ శాంతి భర్త మదన్ మోహన్.

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ గా సస్పెండయిన కళింగిరి శాంతి భర్త మదన్ మోహన్ ల మధ్య వివాదాలు మరింత ముదిరాయని చెప్పవచ్చు. మంగళవారం మదన్ మోహన్ ఉండవల్లిలో ఏర్పాటు చేసిన ప్రజాదర్భార్ కార్యక్రమానికి వచ్చారు. మంత్రి లోకేష్ ను వ్యక్తిగతంగా కలుసుకున్నారు.

Advertisement

తనకు ఎలాగైనా న్యాయం చేయాలని కోరారు. సమాజంలో ఎంపీ లాంటి ఉన్నత పదవిలో ఉన్న విజయసాయిరెడ్డి మాయమాటలతో, తన భార్యను లోబరుచుకుని తాను అమెరికాలో ఉన్న సమయంలో తన భార్యకు దగ్గరయ్యారని, అదే సమయంలో రూ.1500 కోట్ల విలువైన ఖరీదైన విశాఖ భూములను కొల్లగొట్టారని ఆరోపించారు.

గతంలో శాంతి భర్త మదన్ మోహన్ సంచలన కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచారు. ఏకంగా తన భార్యపై, విజయసాయిరెడ్డి లక్ష్యంగా ఆరోపణలు గుప్పించి రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించారు. అయితే శాంతి కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి, తన భర్త అన్నీ అవాస్తవాలే చెబుతున్నారని అందులో నిజం లేదంటూ తన ఆవేదన వెళ్లగక్కారు. అలాగే తన గురించి వ్యక్తిగత హననానికి దెబ్బతీసేలా సోషల్ మీడియా పోస్టులు పెడుతున్న వారిపై కూడా ఆమె ఫిర్యాదు చేశారు.

Advertisement

తాజాగా లోకేష్ ను మదన్ మోహన్ కలిసి మరోమారు తన ఆవేదన వెళ్ళగక్కారు. గత కొంతకాలంగా విజయసాయి అక్రమాలపై ప్రశ్నిస్తున్నానని, ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నానని తనని హైదరాబాద్ నుంచి కోల్ కతాకు బదిలీ చేయించారని ఆరోపించారు. తాను ఐఐపీలో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నానని, వాళ్ల అక్రమాలకు అడ్డొస్తున్నానని తనని బలవంతంగా ఇక్కడినుంచి బదిలీ అయ్యేలా చేశారని ఆరోపించారు. 2023లోనే తనని అకారణంగా అమెరికా పంపించడంలో విజయసాయిరెడ్డి పాత్ర ఉందని అన్నారు. తాను కుటుంబానికి దూరంగా ఉండటంతో విజయసాయి తన భార్యకు దగ్గరయ్యారని అన్నారు.

ఈ విషయంలో తనకు న్యాయం చేయాలని రాష్ట్రపతి, ప్రధాని .హోం మంత్రి, డీజీపీని కూడా కలిశానని అన్నారు. ఈ విషయంలో తనకు ఇప్పటికైనా సత్వరమే న్యాయం జరిపించాలని కోరుతున్నానని అన్నారు. తన భార్య దేవాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్ గా చేసిందని, ఆ సమయంలో రూ.20 కోట్లకు పైగా అక్రమ సంపాదనకు ఒడిగట్టందని అన్నారు.

Also Read: Allu Arjun – Pawan Kalyan: నో అపాయింట్మెంట్.. అల్లు అర్జున్‌ను పవన్ దగ్గరికి రానివ్వడం లేదా.?

మాజీ సీఎం జగన్ ఇంటి సమీపంలో ఉన్న రూ.3 కోట్ల విలువయిన ఇల్లు విశాఖ లో ట్రిపుల్ బెడ్ రూమ్ ప్లాట్, విలాసవంతమైన కార్లు, కుంనపల్లిలో రూ.4 కోట్ల విలువయిన విల్లా ఇలా చాలానే అక్రమంగా తన భార్య సంపాదించుకున్నారని వినతిపత్రంలో వివరించారు. ఇదంతా విజయసాయి అండ చూసుకుని చేసిన నిర్వాకమే అన్నారు. స్పందించిన లోకేష్.. అక్రమాలకు పాల్పడిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హామీ ఇచ్చారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×