E-Paper
Advertisement

Heavy rain: బంగాళాఖాతంలో అల్పపీడనం.. రెండు రోజులు ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు

Heavy rain: బంగాళాఖాతంలో అల్పపీడనం.. రెండు రోజులు ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు
Advertisement

Heavy rain: వాయవ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ కారణంగా రాబోయే రెండు రోజుల్లో ఇది పశ్చిమ వాయవ్యదిశగా వ్యాపించే అవకాశం ఉందని చెప్పారు. అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు. ముఖ్యంగా కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు అధికారులు పేర్కొన్నారు.

రేపు పలు జిల్లాలో అతి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపారు. అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్‌, జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. అల్పపీడన ప్రభావంతో తీరం వెంబడి గంటలకు 40 నుంచి 50 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని చెప్పారు. రెండు రోజుల పాటు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు కీలక హెచ్చరికలను జారీ చేశారు.

Advertisement

ALSO READ: Boat accident: ఘోరప్రమాదం.. పడవ బోల్తా పడి 86మంది మృతి

రాయలసీమలో పలు ప్రాంతాల్లో మూడు రోజుల నుంచి భారీ వర్షాలు పడుతున్నాయని అధికారులు తెలిపారు. కర్నూలు జిల్లా ఆదోనిలో మూడు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఆదోని మండలం వర్షానికి అతలా కుతలం అయ్యింది. మండలంలో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పలు గ్రామాల్లో ఉపాధ్యాయులు, సచివాలయ సిబ్బంది, ఇతరులను ఆదోని నుంచి వచ్చిన వారిని ట్రాక్టర్ల ద్వారా సురక్షితంగా గ్రామాల్లోకి చేర్చారు.

Advertisement

ALSO READ: Google map: గూగుల్ మ్యాప్‌ను నమ్ముకుని సముద్రంలోకి వెళ్లారు.. కారులో ముగ్గురు యువకులు, ఇద్దరు యువతులు

భారీ వర్షాల నేపథ్యంలో రాబోయే మూడు రోజుల పాటు రాష్ట్ర ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.   అన్ని కోస్తా జిల్లాలు, రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాలో, దక్షిణ కోస్తాలో ఎన్టీఆర్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని తెలిపారు. కర్నూలు, నంద్యాల జిల్లాలకు కూడా భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. సాయంత్రం వేళ పొలాల వద్దకు వెళ్లొద్దని అధికారులు సూచిస్తున్నారు. అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×