E-Paper
Advertisement

AP Rains: రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్.. రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

AP Rains: రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్.. రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Advertisement

AP Rains: ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాగల 24 గంటల్లో ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్‌ జైన్‌ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. అల్పపీడనం ప్రభావంతో సోమవారం ఉత్తరాంధ్ర, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొన్నారు. గురువారం నాటికి మరో అల్పపీడనం ఏర్పడి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని అంచనా వేశారు.

గురు, శుక్రవారాల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. సముద్రంలోకి వేటకు వెళ్లిన మత్స్యకారులు బుధవారం లోపు తిరిగి రావాలని సూచించింది. అలాగే వ్యవసాయ పనుల్లో ఉన్న రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.

రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

Advertisement

సోమవారం(సెప్టెంబర్ 22) శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్ల కింద నిలబడరాదని సూచించింది.

ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద

ఆదివారం రాత్రి 7గంటలకు ప్రకాశం జిల్లా సింగరాయకొండలో 69.5 మి.మీ, చిత్తూరు జిల్లా యడమర్రిలో 61 మి.మీ అధిక వర్షపాతం నమోదైంది. ఆదివారం సాయంత్రం 6 గంటల నాటికి ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణానది ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 2.43 లక్షల క్యూసెక్కులు ఉందని, దాదాపు మొదటి హెచ్చరిక స్థాయి వరకు వరద ప్రవాహం చేరుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.

Advertisement

Also Read: నాలుగు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు.. జనవరిలో నోటిఫికేషన్.. నీలం సాహ్ని ప్రకటన!

జలశయాల్లో వరద ప్రవాహం

శ్రీశైలం డ్యాం వద్ద ఇన్ ఫ్లో 2.76, ఔట్ ఫ్లో 3.51 లక్షల క్యూసెక్కులు కాగా.. నాగార్జునసాగర్ వద్ద ఇన్ ఫ్లో,ఔట్ ఫ్లో 3.25 లక్షల క్యూసెక్కులు, పులిచింతల వద్ద ఇన్ ఫ్లో 2.42, ఔట్ ఫ్లో 3.47 లక్షల క్యూసెక్కులు ప్రవాహం ఉందన్నారు. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 28.5 అడుగులు అందని పేర్కొన్నారు. ధవళేశ్వరం వద్ద సాయంత్రం 6 గంటలకు ఇన్ ఫ్లో ఔట్ ఫ్లో 4.88 లక్షల క్యూసెక్కులు ఉందన్నారు.

ఆయా నదీపరీవాహక ప్రాంత, లోతట్టు గ్రామ ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదన్నారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×