E-Paper
Advertisement

America News: పెట్టుబడులే లక్ష్యంగా లోకేష్ టూర్.. అమెరికా, కెనడాల్లో పర్యటన, డాలస్‌లో ఘన స్వాగతం

America News: పెట్టుబడులే లక్ష్యంగా లోకేష్ టూర్.. అమెరికా, కెనడాల్లో పర్యటన, డాలస్‌లో ఘన స్వాగతం
Advertisement

America News: ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులను రప్పించేందుకు ప్రయత్నాలు ముమ్మురం చేశారు మంత్రి లోకేష్. ప్రస్తుతం డాలస్‌కు చేసుకున్న ఆయనకు టీడీపీ ఎన్నారై విభాగం ఘన స్వాగతం పలికింది. డిసెంబర్ 6 నుండి 10 వరకు అంటే దాదాపు ఐదు రోజుల అమెరికా, కెనడా ఆయన పర్యటన కొనసాగనుంది.

డాలస్‌లో మంత్రి లోకేష్‌కు ఘన స్వాగతం

Advertisement

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లోకేష్ రెండోసారి అమెరికాలో పర్యటిస్తున్నారు. ప్రస్తుతం ఆయన డాలస్ చేరుకున్నారు. ఎయిర్ పోర్టులో ఆయనకు ప్రవాసాంధ్రుల నుంచి స్వాగతం లభించింది. ఏపీకి పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా ఆయన పర్యటన సాగుతోంది. తొలిరోజు డాలస్‌లో తెలుగు డయాస్పొరా సమావేశంలో పాల్గొంటారు లోకేష్.

రాష్ట్ర పారిశ్రామిక విధానాలు, పెట్టుబడి దారులకు అనుకూలమైన పర్యావరణ వ్యవస్థను ప్రదర్శించడానికి అక్కడి తెలుగు ప్రజలతో ఇంటరాక్టివ్ సెషన్‌లో ప్రసంగిస్తారు. పదివేల మందికి పైగా ప్రవాస తెలుగువారితో భారీ బహిరంగ సభ జరగనుంది. అందుకోసం ఎన్నారై టీడీపీ, జనసేన, బీజేపీ విభాగాలు సన్నాహాలు చేశాయి.

Advertisement

పెట్టుబడులే లక్ష్యంగా  అమెరికా- కెనడాల్లో పర్యటన

సోమవారం, డిసెంబర్ 8, 9న ఆయన శాన్ ఫ్రాన్సిస్కోలో వివిధ కంపెనీలతో సమావేశాలు నిర్వహించనున్నారు. కొత్త పెట్టుబడులు, వ్యూహాత్మక భాగస్వామ్యాలను ఆయన అక్కడి కంపెనీలతో చర్చించనున్నారు. అమెరికా నుంచి నేరుగా డిసెంబర్ 10న కెనడా వెళ్లనున్నారు. అక్కడ వ్యాపార నాయకులు, పరిశ్రమ సంఘాలతో కలిసి సమావేశం కానున్నారు.

అదే రోజు రాత్రి కెనడా నుంచి నేరుగా హైదరాబాద్‌ చేరుకుంటారు. 11న హైదరాబాద్‌ నుంచి విశాఖ వెళ్లి సీఎం చంద్రబాబుతో కలిసి కాగ్నిజెంట్‌ భూమిపూజ కార్యక్రమంలో మంత్రి పాల్గొంటారు. లోకేశ్ అమెరికాకు వెళ్తూ ఎన్నారైల కోసం ఓ తీపి కబురు తీసుకెళ్లారు. ఎన్నారైలకు ఓ తీపి కబురు చెప్పారు. టీటీడీలో వెంకన్నను దర్శించుకునే గతంలో ఉన్న కోటాను పెంచారు.

ALSO READ: దొంగలతో సెటిల్మెంట్లు.. జగన్ పై సీఎం చంద్రబాబు ఫైర్

ఈ మేరకు టీటీడీ ఓకే చెప్పింది. ఏపీఎన్నార్టీఎస్ ద్వారా తిరుమలలో వెంకన్నను దర్శనం చేసుకోవచ్చు. గతంలో తక్కువ కోటా ఉండేది, ఇప్పుడు 100 కు పెంచారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నారైలు మంత్రి లోకేశ్ కు ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు సభ ఏర్పాట్లపై నిన్న సాయంత్రం డాలస్ ఎన్నారై టీడీపీ వింగ్ సమావేశమైంది.

వందమందికి పైగా సభ్యులు పాల్గొన్నారు. సభ సజావుగా సాగేందుకు సమగ్ర కార్యచరణ రూపొందించారు. సభ నిర్వహణ కోసం ప్రత్యేకంగా స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. దానికి అనుసంధానంగా సెక్యూరిటీ, భోజనాలు, స్వాగత సన్నాహకాల కోసం ఇతర కమిటీలను ఏర్పాటు చేశారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×