E-Paper
Advertisement

Kantakapalli Train Accident : కంటకాపల్లి రైలు ప్రమాదం.. ఫోన్‌లో క్రికెట్ చూస్తూ నడపడంవల్లేనన్న మంత్రి

Kantakapalli Train Accident : కంటకాపల్లి రైలు ప్రమాదం.. ఫోన్‌లో క్రికెట్ చూస్తూ నడపడంవల్లేనన్న మంత్రి
Advertisement
kantakapalli train accident reason
kantakapalli train accident 

Kantakapalli Train Accident : గతేడాది విజయనగరం జిల్లా కంటకాపల్లి జంక్షన్ వద్ద రెండు రైళ్లు ఢీ కొన్న ప్రమాద ఘటనకు అసలు కారణమేంటో రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ శనివారం వెల్లడించారు. లోకో పైలట్, అసిస్టెంట్ లోకో పైలట్ కలిసి మొబైల్ లో క్రికెట్ చూస్తూ రైలును నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తెలిపారాయన. రైల్వేశాఖలో ప్రయాణికుల భద్రత కోసం తీసుకుంటున్న చర్యలను గురించి వివరించిన అశ్వినీ వైష్ణవ్.. కంటకాపల్లి రైలు ప్రమాద ఘటన గురించి ప్రస్తావించారు. ఈ సందర్భంగా ప్రమాదానికి గల కారణాలను ఆయన వెల్లడించారు.

లోకోపైలట్ల నిర్లక్ష్యమే 14 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోవడానికి కారణమైందన్నారు. ట్రైన్ డ్రైవింగ్ పై దృష్టి పెట్టకుండా.. మొబైల్ లో క్రికెట్ చూస్తూ ఉండిపోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు. ఈ ప్రమాదానికి కారణమైన వారిద్దరిపై చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.

Advertisement

Read More : తిరుపతిలో దారుణం.. యువతిపై ప్రేమోన్మాది దాడి..

అక్టోబర్ 29, 2023లో విజయనగరం జిల్లా కంటకాపల్లి వద్ద రాయగడ ప్యాసింజర్ సిగ్నల్ కోసం ఆగి ఉండగా.. వెనుక నుంచి వచ్చిన విశాఖ-పలాస ప్యాసింజర్ రాయగడ ప్యాసింజర్ ను బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో 14 మంది మరణించగా 50 మంది వరకూ గాయపడ్డారు. ఈ ప్రమాదానికి కారణం సిగ్నలింగ్ వ్యవస్థ కాదని, మానవ తప్పిదమే కారణమని కమిషన్ ఆఫ్ రైల్వే సేఫ్టీ అధికారులు చేసిన దర్యాప్తులో తేలింది. దీనిపై రైల్వే బోర్డుకు నివేదిక అందజేయగా.. ఇద్దరు లోకో పైలట్లపై చర్యలు తీసుకున్నారు.

Tags

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×