E-Paper
Advertisement

Vijayawada : విజయవాడలో ఏరులై పారుతున్న మద్యం.. యథేచ్ఛగా అక్రమ అమ్మకాలు..

Vijayawada : విజయవాడలో ఏరులై పారుతున్న మద్యం.. యథేచ్ఛగా అక్రమ అమ్మకాలు..
Advertisement

Vijayawada : విజయవాడ నగరంలో మద్యం ఏరులైపారుతోంది. ఇక్కడ ఉదయం పాల ప్యాకెట్‌ దొరుకుతుందో లేదో కానీ.. మందు మాత్రం ఎనీ టైమ్ అందుబాటులో ఉంటుంది. అజిత్‌సింగ్‌నగర్‌, వాంబే కాలనీల్లో జనావాసాల మధ్య విచ్చలవిడిగా బెల్ట్‌షాపులు వెలిశాయి. వీటి వైపు మాత్రం పోలీసులు కన్నెత్తి కూడా చూడటంలేదని విమర్శలు ఉన్నాయి. దీంతో లిక్కర్‌ వ్యాపారం యథేచ్ఛంగా సాగుతోంది.

Advertisement

వాంబే కాలనీలోని ఓ బెల్ట్‌షాపు నిర్వాహకుడు దుర్గాప్రసాద్‌.. తెలంగాణ నుంచి అక్రమంగా మద్యం తెచ్చి విక్రయిస్తున్నాడని ఆరోపణలు వచ్చాయి. రాత్రి, పగలు అని తేడా లేకుండా అమ్మకాలు సాగిస్తున్నాడని స్థానికులు అంటున్నారు. ఇప్పటికే అతనిపై 35కిపైగా అక్రమ మద్యం కేసులున్నాయి. అయినా ఎలాంటి భయం లేకుండా యథేటచ్ఛగా అక్రమ మద్యం వ్యాపారం కొనసాగిస్తున్నాడు.

విజయవాడలో నగరంలోని చాలా ప్రాంతాల్లో అక్రమంగా మద్యం అమ్మకాలు సాగుతున్నా పోలీసులు ఏం చేస్తున్నారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మద్యానికి బానిసలుగా మారిన వ్యక్తులు అప్పులపాలవుతున్నారు. వారి జీవితాలు రోడ్డుపై పడుతున్నాయి.

Advertisement

మరోవైపు నగరంలో తాగుబోతుల ఆగడాలు శ్రుతిమించాయి. కొన్ని చోట్ల రోడ్లపై వీరంగం సృష్టిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో బయటకు వెళ్లలేకపోతున్నామని మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Tags

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×