E-Paper
Advertisement

AP Liquor scam: లిక్కర్‌ స్కామ్‌లో తవ్వేకొద్దీ అక్రమాలు.. ఓఎస్‌డీ కృష్ణమోహన్‌రెడ్డి అక్రమాలు వెలుగులోకి!

AP Liquor scam: లిక్కర్‌ స్కామ్‌లో తవ్వేకొద్దీ అక్రమాలు.. ఓఎస్‌డీ కృష్ణమోహన్‌రెడ్డి అక్రమాలు వెలుగులోకి!
Advertisement

AP Liquor scam: గత ప్రభుత్వంలో జరిగిన లిక్కర్‌ స్కామ్‌లో తవ్వేకొద్దీ అక్రమాలు బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా మాజీ సీఎం జగన్‌కు ఓఎస్‌డీగా పనిచేసిన కృష్ణమోహన్‌ రెడ్డి బాగోతం వెలుగులోకి వచ్చింది. జగన్‌కు సన్నిహితంగా మెలిగిన ఆయన మద్యం ముడుపులతో తెలంగాణలో భారీగా స్థిరాస్తులు కొనుగోలు చేసినట్లు సిట్‌ గుర్తించింది.

ఐటీ నిబంధనలకు విరుద్ధంగా నగదు చెల్లించి ఆస్తుల కొనుగోలు
కృష్ణమోహన్‌రెడ్డి తన కోడలు స్నిగ్ధారెడ్డి పేరుతో బాన్సువాడలో రూ.51 లక్షల నగదు చెల్లించి కొనుగోలు చేసిన మూడు ప్లాట్ల వివరాలను అధికారులు పసిగట్టారు. నిన్న బాన్సువాడకు వెళ్లి అక్కడి సబ్‌ రిజిస్టార్‌ కార్యాలయంలో స్నిగ్ధారెడ్డి పేరుతో రిజిష్టర్‌ చేసిన ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు తీసుకున్నారు. ఐటీ నిబంధనలకు విరుద్ధంగా నగదు చెల్లించి ఆస్తులు కొనుగోలు చేసినట్టు గుర్తించారు. ఆ ఆస్తులకు చెల్లించిన సొమ్ము మద్యం ముడుపులేనని సిట్‌ పక్కా ఆధారాలు సేకరించింది.

Advertisement

ఆస్తుల జప్తునకు రంగం సిద్ధం చేసిన అధికారులు
తెలంగాణలోని మహేశ్వరం, రామచంద్రపురంలో మరిన్ని ఆస్తులు వెలుగులోకి వచ్చాయి. వాటి వివరాలు తెలుసుకున్న సిట్‌ అధికారులు డాక్యుమెంట్లు సేకరించి జప్తునకు రంగం సిద్ధం చేశారు. రేపు విజయవాడలోని ఏసీబీ కోర్టులో ఈ ఆస్తులకు సంబంధించి జప్తు పిటిషన్‌ దాఖలు చేసే అవకాశం ఉంది. కృష్ణమోహన్‌రెడ్డి బాగోతంపై ఆదాయ పన్ను శాఖకు సిట్‌ అధికారులు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది.

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పోచారంతో బంధుత్వం
తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో కృష్ణమోహన్‌రెడ్డి స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి కారణం ఏంటని సిట్‌ కూపీ లాగింది. అటు జగన్‌కు, భవిష్యత్తులో ఇటు దర్యాప్తు సంస్థలకు తెలిసే అవకాశం లేకుండా హైదరాబాద్‌ కాకుండా గ్రామీణ ప్రాంతాలను ఎంపిక చేసుకున్నట్లు తెలిసింది. తన కుమారుడు రోహిత్‌ రెడ్డికి తెలంగాణలో అన్నివిధాలా బలగం ఉండాలని బాన్సువాడ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి మనుమరాలు స్నిగ్ధారెడ్డితో వివాహం జరిపించారు. 2019లో ఏపీలో అధికారంలోకి వచ్చిన వైసీపీకి పొరుగు రాష్ట్రంలోని కేసీఆర్‌ ప్రభుత్వం అన్నివిధాలా సహకారం అందించింది.

Advertisement

వెలుగులోకి ఏ1 రాజ్ కసిరెడ్డికి సంబంధించిన స్థిరాస్తులు
ఇప్పటికే ఏ1 రాజ్‌ కసిరెడ్డికి సంబంధించి భారీగా స్థిరాస్తులు తెలంగాణలో ఉన్నట్టు వెలుగులోకి వచ్చాయి. వాటిని జప్తు చేసిన అధికారులు ఇతర నిందితులకు సంబంధించిన ఆస్తులున్నాయా? అనే కోణంలో కూపీ లాగుతున్నారు.

Also Read: నంద్యాలలో ఘోర విషాదం.. ట్రాక్టర్ కింద పడి రెండేళ్ల బాలుడు మృతి

13కు చేరిన అరెస్ట్ అయిన వారి సంఖ్య
లిక్కర్‌ ముఠా పలు రాష్ట్రాలతో పాటు విదేశాల్లో సైతం మద్యం ముడుపుల సొమ్ముతో వందల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడం, ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులకు డబ్బు పంపిణీ చేయడం, కిలోల కొద్దీ బంగారం కొనుగోలు చేయడం, సూట్‌ కేసు కంపెనీల ద్వారా మనీలాండరింగ్‌కు పాల్పడటం వంటి అంశాలు ఇప్పటికే వెలుగులోకి వచ్చాయి. సుమారు యాభై మందికి పైగా నిందితులను సిట్‌ అధికారులు ఈ కేసులో చేర్చారు. ఇటీవలే ముంబైకి చెందిన హవాలా వ్యాపారిని అరెస్టు చేశారు. దీంతో అరెస్టయిన వారి సంఖ్య 13కు చేరింది.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×