E-Paper
Advertisement

Tirumala Chirutha News: తిరుపతిలో చిరుత కలకలం

Tirumala Chirutha News: తిరుపతిలో చిరుత కలకలం
Advertisement

Tirumala Chirutha News: తిరుపతి జూపార్క్ రోడ్డులో చిరుత సంచారం భయాందోళనకు గురిచేస్తుంది. అలిపిరి నుండి జూపార్క్ వెళ్లే రోడ్డులో వాహనదారులకు చిరుత కనిపించింది. అరవింద ఐ ఆసుపత్రి సమీపంలో చిరుత సంచరిస్తోంది. ఇక చిరుత దృశ్యాలను వాహనదారులు వారి సెల్ ఫోన్స్‌లో బంధించారు. తాజా వీడియోలు వైరల్ కావడంతో అప్రమత్తమైన అధికారులు టూవీలర్ వాహనాలపై వెళ్లే భక్తులకు అప్రమత్తం చేశారు.

ఇదిలా ఉంటే నిన్న అన్నమయ్య భవనం సమీన అటవీ ప్రాంతంలో మరో చిరుత సంచరించింది. చిరుత మంగళవారం సాయంత్రం 4.10 గంటల ప్రాంతంలో ఇనుప కంచెను దాటుకొని వచ్చిన దృశ్యాలను సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. సీసీ కెమెరాలను పరిశీలించిన అటవీ శాఖ అధికారులు.. ఘటన స్థలానికి చేరుకుని అటవీ ప్రాంతంలోకి మళ్లించారు. చిరుత సంచారంతో భక్తులు భయాందోళన చెందుతున్నారు. కొంతకాలంగా తిరుమల పరిసరాల్లో చిరుతల సంచారం పెరిగింది.  మెట్టు మార్గంలో ఇనుప కంచెను ఏర్పాటు చేయాలని భక్తులు టీటీడీని కోరుతున్నారు.

Advertisement

Also Read: అధ్యక్ష పదవి ఈటలకు ఎందుకు ఇవ్వలేదంటే?

ముఖ్యంగా అలిపిరి మెట్టు మార్గంలో వెళ్ళే భక్తులకు, శ్రీవాకి మెట్టు మార్గంలో వెళ్లే భక్తులకు తిరుమలలో చిరుతలు కనిపించడం సాధారణమై పోయింది. ఈ మార్గంలో వెళ్లే భక్తులు గుంపులుగా వెళ్లాలని ఇంతకు ముందు టీటీడీ ఆదేశించింది. మరోవైపు టీటీడీ ఎన్ని చర్యలు చేపట్టినా.. చిరుతలు మాత్రం భక్తులను భయపెడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాల గుండా వెళ్లే భక్తులు అలర్ట్‌గా ఉండాలని టీటీడీవారు హెచ్చరిస్తున్నారు.

Advertisement

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×