E-Paper
Advertisement

Nellore News : ఆలయంలో లంకె బిందె.. భారీగా బంగారు నాణేలు.. ముగ్గురి అరెస్ట్..

Nellore News : ఆలయంలో లంకె బిందె.. భారీగా బంగారు నాణేలు.. ముగ్గురి అరెస్ట్..
Advertisement
Nellore News

Nellore News : నెల్లూరు జిల్లా పొదలకూరు పంచాయతీ పరిధిలోను చిట్టేపల్లి గ్రామంలో ముగ్గురు యువకులకు దొరికిన లంకె బిందెను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మే 7న తేనె కోసం గ్రామ సమీపంలోని కొండపై ఉన్న పురాతన అంకమ్మ ఆలయం వద్దకు యువకులు వెళ్లారు. అక్కడ వారికి విలువైన బంగారు నాణేలతో కూడిన లంకెబిందె దొరికింది.

Advertisement

యువకులు కొన్ని నాణేల్ని చెన్నైలో విక్రయించి, సొమ్ము చేసుకున్నారు. విషయం పోలీసులకు తెలియడంతో అప్పటి నుంచి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎట్టకేళకు ముగ్గురు నిందితులను పట్టుకున్నారు. నాణేలు చెన్నైలో విక్రయించి‌నట్టు గుర్తించారు. బిందెను చెరువులో పడవేశారనే సమాచారంతో చెరువు వద్దకు చేరుకుని.. 10 మంది గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. అయినా బిందె దొరకలేదు.

మరోవైపు.. చెన్నైలో విక్రయించిన బంగారు నాణేల్ని పోలీసులు రికవరీ చేశారు. 14 లక్షల నగదు, 21 సవర్ల బంగారు నగలు, 436 చిన్న బంగారు నాణేలు, 63 పెద్ద బంగారు నాణేలు, కారు, ఆటో స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురినీ అదుపులోకి తీసుకొని విచారించారు. గుప్త నిధులు, లంకెబిందెల కోసం ఎవరైనా ప్రయత్నిస్తే.. కఠిన చర్యలు తీసుకుంటామని‌ నెల్లూరు రూరల్ డీఎస్పీ హెచ్చరించారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×