E-Paper
Advertisement

Landslide in Srisailam: శ్రీశైలం‎లో భారీ వర్షం.. విరిగిపడ్డ కొండచరియలు

Landslide in Srisailam: శ్రీశైలం‎లో భారీ వర్షం.. విరిగిపడ్డ కొండచరియలు
Advertisement

శ్రీశైలం జలాశయం వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. భారీ వర్షానికి కారణంగా కొండ చరియలు విరిగి పెద్ద పెద్ద బండరాళ్లు ఘాట్‌రోడ్డులో అడ్డంగా పడ్డాయి. రహదారిపై బండరాళ్లు పడటంతో వాహనాలకు అంతరాయం ఏర్పడింది. అయితే అదృష్టవశాత్తు కొండ చరియలు విరిగిపడే సమయంలో వాహనాలు ఏవి లేకపావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. రహదారిపై రాళ్లను తొందరగా తొలగించి ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఉండాలను భక్తులు అధికారులు విజ్ఞప్తిచేశారు.

Advertisement

మరో  వైపు తెలంగాణాలో కూడా భారీ వర్షాలు పడుతున్నాయి. ఒకవైపు ఉక్కపోత.. మరోవైపు భారీ వర్షం.. ఇది ప్రస్తుతం హైదరాబాద్‌తో పాటు తెలంగాణవ్యాప్తంగా ఉన్న పరిస్థితి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఉక్కపోత కొనసాగుతుండగా.. ఆ తర్వాత ఒక్కసారిగా వరుణుడు విరుచుకుపడుతున్నాడు. తెల్లవారుజామున ప్రారంభమై.. ఉదయం వరకు కుండపోత వాన కురుస్తోంది. దానికి తోడు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురస్తుండటంతో నగరవాసులు భయాందోళన చెందుతున్నారు. నిన్న పంజాగుట్టలో అపార్ట్‌మెంట్‌పై పిడుగు పడింది. రాత్రి కురిసిన వర్షానికి ఇంకా కొన్ని కాలనీలు జలవలయంలోనే చిక్కుకున్నాయి. రోడ్లపైనే వర్షపు నీరు ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. కాగా.. వరుణుడు ఉదయం పూట కాస్త బ్రేక్ ఇచ్చినా.. ఎప్పుడు విరుచుకుపడతాడో అన్న టెన్షన్ ఉంది. అప్పటికప్పుడు ఒక్కసారిగా ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లు వర్షం పడుతోంది.

Also Read: జగన్‌కు మరో భారీ షాక్.. వైసీపీ కేంద్ర ఆఫీసుకు వచ్చిన..

Advertisement

ఇక.. తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇవాళ, రేపు హైదరాబాద్ తో పాటు రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. ఇక రేపు, ఎల్లుండు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఉరుములు, మెరుపులతో పాటు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందని తెలిపారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల సహా పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×