E-Paper
Advertisement

Kotamreddy: కోటంరెడ్డి హౌజ్ అరెస్ట్‌తో ఉద్రిక్తత.. రంగంలోకి జనసేన..

Kotamreddy: కోటంరెడ్డి హౌజ్ అరెస్ట్‌తో ఉద్రిక్తత.. రంగంలోకి జనసేన..
Advertisement
kotamreddy

Kotamreddy: రెబెల్ ఎమ్మెల్యే ప్రభుత్వంపై పోరు బాట మొదలెట్టారు. ప్రజా సమస్యలపై ఉద్యమానికి సిద్ధమయ్యారు. పొట్టేపాలెం కలుజు బ్రిడ్జ్ నిర్మాణం కోసం జలదీక్ష చేస్తానన్నారు. ఆయన చేస్తానంటే.. సర్కారు చేయనిస్తుందా? ఉదయాన్నే పోలీసులు వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఇంటిని చుట్టు ముట్టారు. జలదీక్ష చేసేందుకు ఇంటి నుంచి బయటకు రాకుండా హౌజ్ అరెస్ట్‌తో కట్టడి చేశారు. రద్దీగా ఉన్న రూట్లో దీక్ష చేపడితే.. ట్రాఫిక్ కి ఇబ్బంది కలుగుతోందనేది పోలీసుల పాయింట్.

అటు.. కోటంరెడ్డి ఇంటికి పెద్ద ఎత్తున అభిమానులు చేరుకొని ఆందోళన చేస్తున్నారు. పోలీసుల తీరుపై ఎమ్మెల్యే కోటంరెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రజాస్వామ్యబద్ధంగా జలదీక్ష చేపడితే.. పోలీసులు బలప్రయోగం చేస్తున్నారని ఫైరఱ్ అయ్యారు. పోలీసుల తీరు మారకపోతే.. హైకోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుందని కోటంరెడ్డి హెచ్చరించారు.

Advertisement

హౌస్ అరెస్ట్ లో ఉన్న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి స్థానిక జనసేన నేతల మద్దతు తెలిపారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న శ్రీధర్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేయడం దుర్మార్గమని జనసేన నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి అన్నారు. సమస్యలపై గలమెత్తిన గొంతును ప్రభుత్వం నొక్కే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. వైసీపీ హయాంలో శాంతియుత నిరసనలకు కూడా అనుమతి లేకుండా పోయిందని మండిపడ్డారు. త్వరలోనే ప్రజలు వైసీపీకి బుద్ది చెబుతారన్నారు జనసేన నేతలు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×