E-Paper
Advertisement

Kota Srinivas Rao: కోట చివరి మాటలు.. రాజమౌళికి అన్యాయం, ఇండస్ట్రీ గురించి కీలక విషయాలు

Kota Srinivas Rao: కోట చివరి మాటలు.. రాజమౌళికి అన్యాయం, ఇండస్ట్రీ గురించి కీలక విషయాలు
Advertisement

Kota Srinivas Rao: నటుడు కోట శ్రీనివాసరావు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. టాలీవుడ్‌లో తనకంటూ ఓ ఇమేజ్ సంపాదించుకున్నారు. దాని వెనుక ఆయన కష్టపడిన కష్టం అంతా ఇంతా కాదు. మూడు దశాబ్దాల పాటు డ్రామా ఆర్టిస్టుగా అభిమానుల మనసులో చెరగని ముద్ర వేసుకున్నారు. పుట్టినరోజు సందర్భంగా తన గురించి మాత్రమేకాదు.. చిత్ర పరిశ్రమ గురించి కీలక విషయాలు బయటపెట్టారు ఆయన.

1958లో డ్రామా ఆర్టిస్టుగా అడుగుపెట్టిన ఆయన 1986 వరకు కొనసాగించారు. నటుడు కావాలని తాను ఏనాడు అనుకోలేదు. బ్యాంకు ఉద్యోగి నుంచి అనుకోకుండా వెండితెరపై వచ్చారు. 1978లో వెండితెరపై అడుగుపెట్టారు కోట. ప్రతిఘటన సినిమా కోట వెండితెర కెరీర్ మలుపు తిప్పింది.

Advertisement

వెండితెరపై ఐదు రకాల సినిమాలు ఉండేవని కనిపించేవని, రాను రాను ఆ పరిస్థితిలో మార్పు వచ్చిందన్నారు. అప్పట్లో సినిమా ప్రభావం మనుషులపై ఉండేదని, ఇప్పుడు మనుషుల ప్రభావం సినిమాపై పడిందని అన్నారు. తనకంటే కోట గొప్ప నటుడని ఒకానొక సందర్భంలో కైకాల సత్యనారాయణ అన్నారు. తాను అదొక సర్టిఫికెట్‌గా భావించానని మనసులోని మాట బయపెట్టారు.

అప్పటి సినిమాలు వేరని.. ఇప్పుడు చిత్ర పరిశ్రమ వ్యాపారంగా మారిందన్నారు. తెలుగులో సినిమాలు తీస్తే అవార్డులు వస్తాయని, ఈ విషయంలో దైర్యం చేస్తే సక్సెస్ అవుతుందన్నారు. ఫలానా బ్యానర్ నుంచి సినిమా వస్తుంటే ఆసక్తికరంగా ఉండేదని, ఇప్పుడు సినిమాల్లో అసలు కథ లేదని తేల్చేశారు.

Advertisement

ALSO READ: కోటా వల్లే బెడవాడలో ఆ పార్టీ జెండా రెపరెపలు

ఫిల్మ్ఇండస్ట్రీ గురించి అంతర్గత విషయాలను ఆయన బయటపెట్టారు. రాజమౌళి లాంటి డైరెక్టర్ ఎవరూ లేరన్నారు. ఆయనకు ఏం గౌరవం జరిగిందని, కర్ణాటక తరపున పద్మశ్రీ అవార్డు వచ్చిందన్నారు. కోట చివరి సినిమా ‘హరిహర వీరమల్లు’. అందులో ప్రతినాయకుడి పాత్ర పోషించారు. మరి చివరి మూవీ ఆయనకు ఎలాంటి పేరు తెస్తుందో చూడాలి.

 

 

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×