E-Paper
Advertisement

పవన్ కళ్యాణ్‌ను విమర్శిస్తే నాలుక చీరేస్తాం.. దాసరి రాముపై కిరణ్ రాయల్ తీవ్ర ఆగ్రహం!

పవన్ కళ్యాణ్‌ను విమర్శిస్తే నాలుక చీరేస్తాం.. దాసరి రాముపై కిరణ్ రాయల్ తీవ్ర ఆగ్రహం!
Advertisement

Kiran Royal: తిరుపతిలో జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ కిరణ్ రాయల్ నిర్వహించిన మీడియా సమావేశంలో వైసిపి నేత దాసరి రాముపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాజకీయ లబ్ధి కోసం దాసరి రాము వైసిపికి అమ్ముడుపోయారని, పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్‌లను కించపరిచేలా మాట్లాడటం సిగ్గుచేటని మండిపడ్డారు.

అమ్ముడుపోయిన నేతలు.. కుట్రలు

Advertisement

2019లో జనసేన ఓటమి తర్వాత కొంతమంది కాపు నేతలు జగన్ మోహన్ రెడ్డి కింద ఊడిగం చేయడానికి వెళ్ళిపోయారని, వారిలో దాసరి రాము ఒకరని కిరణ్ రాయల్ విమర్శించారు. గుంటూరు వైసిపి సీటు కోసమే రాము అమ్ముడుపోయి, రెడ్ల కనుసన్నల్లో పనిచేస్తున్నాడని ఆరోపించారు. పవన్ కళ్యాణ్‌ను ఒకే కులానికి పరిమితం చేయడానికి పెద్ద కుట్ర జరుగుతోందని, ఇందులో భాగంగానే నాదెండ్ల మనోహర్‌ను టార్గెట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాము నోరు అదుపులో పెట్టుకోకపోతే రోడ్డుపై తిరిగే పిచ్చికుక్క కంటే హీనంగా చూడాల్సి వస్తుందని హెచ్చరించారు.

సుగాలి ప్రీతి కేసు.. జగన్ వైఫల్యం

Advertisement

సమాజం కోసం పవన్ కళ్యాణ్ చేసిన పోరాటాలను ఈ సందర్భంగా కిరణ్ రాయల్ గుర్తుచేశారు. సుగాలి ప్రీతికి న్యాయం జరగడం కోసం లక్షలాది మందితో పవన్ సభ పెట్టారని, ఆ కుటుంబానికి అండగా నిలిచారని చెప్పారు. సొంత తల్లి, చెల్లిని పట్టించుకోని జగన్ మోహన్ రెడ్డి.. సుగాలి ప్రీతి సమస్యను ఏం పరిష్కరిస్తాడని ప్రశ్నించారు. అలాగే తెలంగాణ ప్రజలు ఎప్పుడు ఇబ్బందుల్లో ఉన్నా పవన్ కళ్యాణ్ కోట్ల రూపాయల సహాయం చేశారని కొనియాడారు.

దెబ్బకు దెబ్బ.. రివెంజ్ ఖాయం

వైసిపి సోషల్ మీడియా పేమెంట్ బ్యాచ్‌తో పాటు పవన్‌ను విమర్శించడానికి ఒక ప్రత్యేక టీమ్ సిద్ధమైందని కిరణ్ రాయల్ మండిపడ్డారు. డబ్బు, మద్యం ఇచ్చి ఒక మహిళతో పవన్ కళ్యాణ్‌పై మాట్లాడించడం జర్నలిజానికే మచ్చ అని ఆవేదన వ్యక్తం చేశారు. కాపు ముసుగులో వచ్చి పవన్ కళ్యాణ్‌ను విమర్శిస్తే బట్టలూడదీసి కొడతామని, ఇకపై దెబ్బకు దెబ్బ తీస్తామని, రివెంజ్ ఖాయమని తీవ్రంగా హెచ్చరించారు.

Also Read: ఒడిశాలో ఘోర ప్రమాదం.. కారును 600 మీటర్లు ఈడ్చుకెళ్లిన ట్రక్కు.. వీడియో వైరల్!

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×