E-Paper
Advertisement

Kethireddy: ఆపరేషన్ సింధూర్‌పై..‌ వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వ్యాఖ్యలు వైరల్

Kethireddy: ఆపరేషన్ సింధూర్‌పై..‌ వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వ్యాఖ్యలు వైరల్
Advertisement

Kethireddy: ఆపరేషన్ సింధూర్‌పై ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి చేసిన వ్యాఖ్యలు.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేతిరెడ్డి మాటలు దేశ భద్రత అంశాన్ని తక్కువచేసేలా ఉన్నాయంటూ.. బీజేపీ శ్రేణులు తీవ్రంగా విమర్శిస్తున్నారు.

ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడిన కేతిరెడ్డి, ట్రంప్ ట్వీట్ చేసేంత వరకు యుద్ధం ముగిసిందని మనకు ఎవరికీ తెలియదు. ఏదో జరిగిపోతుందని అనుకున్నాం కానీ ఎవరికి తెలియకుండా ఆపరేషన్ సింధూర్ ముగిసింది అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు డిల్లీ బ్లాస్ట్ ఏమైందో ఇప్పటికీ ప్రజలకు పూర్తిగా తెలియదు అంటూ చేసిన వ్యాఖ్యలు మరింత వివాదాస్పదంగా మారాయి.

Advertisement

కేతిరెడ్డి మాటలు వెలుగులోకి వచ్చిన వెంటనే.. బీజేపీ శ్రేణులు తీవ్రంగా స్పందించింది. దేశ సైన్యం నిర్వహించిన ఆపరేషన్లపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధ్యతారాహిత్యమని బీజేపీ నాయకులు మండిపడుతున్నారు. ఆపరేషన్ సింధూర్ దేశ భద్రతకు సంబంధించిన అత్యంత కీలక అంశమని, అలాంటి ఆపరేషన్‌పై రాజకీయ లాభనష్టాల కోసం మాట్లాడటం సరికాదని వారు అంటున్నారు. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దేశవ్యాప్తంగా తప్పు సంకేతాలు పంపుతుందని విమర్శిస్తున్నారు.

ఈ క్రమంలో సోషల్ మీడియాలో బీజేపీ నాయకులు కేతిరెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తున్నారు. దేశ భద్రతపై రాజకీయం చేయడం మానుకోవాలి, సైనికుల త్యాగాలను తక్కువచేసే వ్యాఖ్యలు సహించబోం అంటూ పోస్టులు పెడుతున్నారు. కొందరు బీజేపీ నేతలు కేతిరెడ్డిని నేరుగా ట్యాగ్ చేస్తూ ఘాటైన ప్రశ్నలు సంధిస్తున్నారు. దీంతో ఈ వ్యవహారం సోషల్ మీడియాలో పెద్ద రాజకీయ వాగ్వాదంగా మారింది.

Advertisement

Also Read: తిరుపతిలో హై టెన్షన్.. మద్యం మత్తులో ఆలయ గోపురం పైకెక్కి వ్యక్తి హల్‌చల్‌!

తాజాగా కేతిరెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. ఒకవైపు మళ్లీ రాజకీయంగా చురుగ్గా మారుతున్నారన్న చర్చ జరుగుతుండగా, మరోవైపు ఆయన వ్యాఖ్యలు బీజేపీకి కొత్త అస్త్రంగా మారినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో ఈ అంశం మరింత పెద్ద రాజకీయ వివాదంగా మారే అవకాశముందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

 

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×