// //

Vizag News : విశాఖపట్నంలో మెడికో ఆత్మహత్య చేసుకుంది. కేరళకు చెందిన మెడికో.. వైజాగ్ డాబా గార్డెన్స్‌లోని లాడ్జిలో ఉరివేసుకుని సూసైడ్ చేసుకుంది.
లోపలి నుంచి గడియ పెట్టుకుని గదిలో ఆత్మహత్యకు పాల్పడగా.. పోలీసులు తలపులు విరగొట్టి లోనికి వెళ్లారు. ఘటనాస్థలంలో సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు.
చైనాలో ఎంబీబీఎస్ ఫోర్త్ ఇయర్ చదువుతున్న రమేష్ కృష్ణ అనే యువతి.. విశాఖకు వచ్చి సూసైడ్ చేసుకోవడం పలు అనుమానాలు తావిస్తోంది. జీవితంలో ఓడిపోయానని.. తన చావుకు ఎవరు బాధ్యులు కాదంటూ మలయాళంలో సూసైడ్ నోట్ రాసి ఉంది.