E-Paper
Advertisement

Hari Rama Jogayya Letter: ఆ విషయం మాటేంటి? సీఎం, డిప్యూటీ సీఎంలకు కాపు నేత లేఖ

Hari Rama Jogayya Letter: ఆ విషయం మాటేంటి? సీఎం, డిప్యూటీ సీఎంలకు కాపు నేత లేఖ
Advertisement

Hari Rama Jogayya Letter: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు పూర్తి అయ్యింది. రిజర్వేషన్ల అంశంపై ప్రభుత్వంలో ఎలాంటి కదలిక లేకపోవడంతో రియాక్ట్ అయ్యారు కాపు నేత హరి రామజోగయ్య. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌‌కు బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖ సారాంశం లోకి ఒక్కసారి వెళ్దాం.

కాపు రిజర్వేషన్ కోసం గతంలో తాను ఆమరణ దీక్ష చేశాను. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత చర్చించి సమిష్టి నిర్ణయం తీసుకుందామని చెప్పి పవన్ కళ్యాణ్ దీక్ష విరమింప చేశారని గుర్తు చేశారు హరి రామజోగయ్య. కాపు రిజర్వేషన్‌లపై గత టీడీపీ ప్రభుత్వం సానుకూలంగా తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయాలని కోరారు.

Advertisement

కేంద్ర ప్రభుత్వం అగ్రవర్ణ పేదలకు కల్పించిన 10 శాతం రిజర్వేషన్లలో కాపులకు విద్య, ఉద్యోగాల్లో 5 శాతం ఇవ్వాలన్నది ఆయన కోరిక. గత వైసీపీ హయాంలో కాపు నిరుద్యోగ యువత నష్టపోయిందన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రకటించిన మెగా డీఎస్సీ‌లో కాపు నిరుద్యోగ యువత తీవ్రంగా నష్టపోతారని పేర్కొన్నారు.

ఇటు కేంద్రం, అటు ఏపీలో ప్రభుత్వాల ఏర్పాటుకు పవన్ కళ్యాణ్ ముఖ్య కారణమని, 90 శాతం కాపులు బలపరచడం వల్లే కూటమి ప్రభుత్వం వచ్చిందన్నది ఆయన మాట. ఆందోళనలకు అవకాశం ఇవ్వకుండా రిజర్వేషన్లు విషయంలో న్యాయం చేయాలని డిమాండ్ చేశారు కాపు బలిజ సంక్షేమ సేన అధ్యక్షుడు హరి రామజోగయ్య. కూటమి సర్కార్ వచ్చిన మొదటి నెలలో హరి రామజోగయ్య రిజర్వేషన్లపై ప్రభుత్వానికి లేఖ రాయడం ఇది రెండోసారి.

Advertisement

ALSO READ: దావోస్‌లో తెలంగాణ-ఏపీ సీఎంలు.. అస్త్రాలు రెడీ

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×