E-Paper
Advertisement

Kakinada Fire Accident: ఘోర అగ్నిప్రమాదం.. సజీవ దహనమైన 18 మంది కూలీలు

Kakinada Fire Accident: ఘోర అగ్నిప్రమాదం.. సజీవ దహనమైన 18 మంది కూలీలు
Advertisement

Kakinada Fire Accident: కాకినాడ జిల్లా వేట్లపాలెం జి.మేడపాడు మధ్య గల బాణసంచా తయారీ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘోర ప్రమాదంలో 18 మంది కార్మికులు సజీవ దహనమైనట్లు సమాచారం. పేలుడు ధాటికి మృతదేహాలు చెల్లాచెదురుగా ఎగిరిపడటం అక్కడి భీభత్సానికి అద్దం పడుతోంది. మంటల్లో మరో 15 మంది వరకు కార్మికులు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. గతంలోనూ ఇదే ప్రాంతంలో పేలుళ్లు జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు.

ప్రమాదం జరిగిన వెంటనే దట్టమైన పొగ.. మంటలు ఆ ప్రాంతాన్ని కమ్మేశాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించేందుకు అంబులెన్సులు సిద్ధం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా బాణసంచా తయారీ సాగుతుందా లేదా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. జిల్లా ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ భారీ ప్రాణనష్టం ఆ ప్రాంతంలో తీరని విషాదాన్ని నింపింది.

Advertisement

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×