E-Paper
Advertisement

ACB Raids: అమాయకుడిపై ఖాకీ ప్రతాపం.. కట్ చేస్తే సీన్ రివర్స్! ఏసీబీ వలలో సీఐ, ఎస్సై!

ACB Raids: అమాయకుడిపై ఖాకీ ప్రతాపం.. కట్ చేస్తే సీన్ రివర్స్! ఏసీబీ వలలో సీఐ, ఎస్సై!
Advertisement

ACB Raids:  కడప జిల్లా సింహాద్రిపురం పోలీస్ స్టేషన్‌లో ఎస్సై అనిల్ కుమార్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. అనంతపురం పట్టణానికి చెందిన బ్రహ్మం అనే వ్యక్తి నడుపుతున్న ఆటో కన్సల్టెన్సీ ద్వారా విక్రయించిన ఒక బైక్‌ను, బీహార్‌కు చెందిన దిలీప్ అనే నిందితుడు చైన్ స్నాచింగ్ నేరాలకు ఉపయోగించాడు. అయితే.. అసలు నిందితుడిని వదిలేసి.. బైక్ అమ్మిన బ్రహ్మంను కేసులో ఇరికిస్తామని పోలీసులు భయపెట్టారు. ఈ కేసు నుండి తప్పించడానికి 8 లక్షల రూపాయలు డిమాండ్ చేయగా.. చివరికి 2 లక్షలకు బేరం కుదిరింది.

ఏసీబీ ఎంట్రీ..

Advertisement

బాధితుడు బ్రహ్మం ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఇప్పటికే ఎస్సై అనిల్‌కు 50 వేల రూపాయలు అందగా.. మిగిలిన మొత్తాన్ని తీసుకుంటుండగా అధికారులు ఆయన్ని పట్టుకున్నారు. విచారణలో.. తాను పులివెందుల రూరల్ సీఐ వెంకటరమణ ఆదేశాల మేరకే ఈ లంచం తీసుకున్నట్లు ఎస్సై వెల్లడించారు. దీంతో ఏసీబీ అధికారులు లింగాల నుండి పులివెందుల వెళ్తున్న సీఐ వెంకటరమణను మార్గ మధ్యలో అదుపులోకి తీసుకున్నారు.

సోదాల్లో విస్తుపోయే నిజాలు

Advertisement

అనంతరం పులివెందులలోని సీఐ వెంకటరమణ నివాసంలో ఏసీబీ సీఐ నాగరాజ్ ఆధ్వర్యంలో ముమ్మర సోదాలు జరిగాయి. ఈ సోదాల్లో 20 తులాల బంగారం, కీలక పత్రాలను అధికారులు గుర్తించారు.

ఒక ఆసక్తికర పరిణామంలో.. సోదాలు జరుగుతున్న సమయంలో సీఐ ఇంట్లోని బంగారం, నగదు , పత్రాలను ఒక బ్యాగులో సర్దుకుని బయటకు పారిపోవడానికి ప్రయత్నించిన హోంగార్డు ప్రసాద్ రెడ్డిని ఏసీబీ అధికారులు చాకచక్యంగా పట్టుకున్నారు. ప్రస్తుతం హోంగార్డును కూడా విచారిస్తున్నారు. నేరస్తుడిని పట్టుకోవాల్సిన పోలీసులే.. అమాయకులను బెదిరించి వసూళ్లకు పాల్పడటం స్థానికంగా చర్చనీయాంశమైంది.

Also Read: వికారాబాద్‌లో దారుణం.. ప్రాణ స్నేహితుడిని ముక్కలు ముక్కలుగా నరికి..

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×