E-Paper
Advertisement

Jogi Ramesh: చంద్రబాబు, లోకేశ్‌పై వ్యాఖ్యల సెగ.. మాజీ మంత్రి జోగి రమేశ్ ఇంటికి నిప్పు.. ఇబ్రహీంపట్నంలో హైటెన్షన్!

Jogi Ramesh: చంద్రబాబు, లోకేశ్‌పై వ్యాఖ్యల సెగ.. మాజీ మంత్రి జోగి రమేశ్ ఇంటికి నిప్పు.. ఇబ్రహీంపట్నంలో హైటెన్షన్!
Advertisement

Jogi Ramesh: ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత జోగి రమేశ్ నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఆయన ఇంటిపై తెలుగుదేశం పార్టీ (TDP) కార్యకర్తలు దాడి చేసి, నిప్పు పెట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్‌పై జోగి రమేశ్ చేసిన అనుచిత వ్యాఖ్యలే ఈ దాడికి కారణమని తెలుస్తోంది.

శ‌నివారం జోగి రమేశ్ మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌లను ఉద్దేశించి చేసిన ఘాటు వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. భారీ సంఖ్యలో తరలివచ్చిన టీడీపీ నేతలు, కార్యకర్తలు జోగి రమేశ్ ఇంటిని ముట్టడించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుందని ముందుగానే ఊహించిన జోగి రమేశ్, తన నివాసం నుండి వెళ్లిపోయారు. ఆవేశానికి లోనైన కార్యకర్తలు ఆయన ఇంటి ఆవరణలో ఉన్న ఫర్నిచర్, ఇతర వస్తువులకు నిప్పు పెట్టారు. దీంతో అక్కడ దట్టమైన పొగ కమ్ముకుంది.

Advertisement

సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని నిరసనకారులను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. సంఘటనా స్థలంలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు.

నిన్న సత్తెనపల్లిలో అంబటి రాంబాబు ఇంటి ముట్టడి ఘటన మరవకముందే, నేడు ఇబ్రహీంపట్నంలో ఈ తరహా దాడి జరగడం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. తమ నాయకులను విమర్శిస్తే సహించేది లేదని టీడీపీ కార్యకర్తలు హెచ్చరిస్తుండగా, ప్రభుత్వం కావాలనే కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని వైకాపా నేతలు ఆరోపిస్తున్నారు.

Advertisement

Read Also: కష్టపడే కార్యకర్తలకు పట్టం కడతాం.. పని చేయని ఎమ్మెల్యేలకు నమస్కారమే.. నేత‌ల‌కు చంద్రబాబు సీరియస్ వార్నింగ్

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×