E-Paper
Advertisement

Allegations again on CS JawaharReddy: దేనికైనా సిద్ధమే? భోగాపురంపై ఎందుకంత ప్రేమ?

Allegations again on CS JawaharReddy: దేనికైనా సిద్ధమే? భోగాపురంపై ఎందుకంత ప్రేమ?
Advertisement

Allegations again on CS Jawaharreddy: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్య కార్యదర్శి సీఎస్ జవహర్‌ రెడ్డిపై తీవ్రమైన ఆరోపణలు చేశారు జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్. తాను చేసిన ఆరోపణలు ముమ్మాటికీ నిజమేనని కుండబద్దలు కొట్టారు. రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయని, ఒక్క భోగాపురం మీదే ఆయనకు ఎందుకుంత ప్రేమని సూటిగా ప్రశ్నించారు. కుమారుడ్ని ముందే అక్కడికి పంపి అగ్రమెంట్ చేసుకున్నారంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు సంధించారు.

నా ఎస్సీలు, నా ఎస్టీలు అని చెప్పుకునే ప్రభుత్వం చేసిన న్యాయం ఇదేనా అని అన్నారు విశాఖ కార్పొరేటర్. ఈ విషయంలో సీఎస్ జవహర్‌రెడ్డికి నిజంగా చిత్తశుద్ది ఉంటే సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. దీనికి సంబంధించిన జీవో నెంబర్ 596 బయటకు వచ్చిన నుంచి ఇప్పటివరకు జరిగిన లావాదేవీలపై విచారణ చేయించాలన్నారు.

Advertisement

ఆదివారం విశాఖలో మీడియాతో మాట్లాడిన మూర్తి, తన ఆరోపణలు అవాస్తమైతే ఏ శిక్షకైనా సిద్ధమేనని ప్రకటించారు. జగన్ వైఫ్ భారతి పేరు చెప్పి ఈ లావాదేవీలన్నీ వేగంగా జరిగేలా చేశారని, ఇప్పుడు ఆ ప్రాంతంలోని భూములు రైతుల చేత్తుల్లో లేవన్నారు. త్వరలో దీని వెనుకున్న ఎమ్మార్వో పేర్లు బయటపెడతానని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ALSO READ: చీఫ్ సెక్రటరీ కాదు.. చీప్ సెక్రటరీ : సీఎస్ పై సోమిరెడ్డి ఫైర్

Advertisement

వైసీపీ ప్రభుత్వం మళ్లీ రాదని తెలిసి రహస్యంగా లావాదేవీలు జరిపారని ఆరోపించారు మూర్తి యాదవ్. సీఎస్ కొడుకు ఉత్తరాంధ్రలో బినామీల పేర్లతో దాదాపు 800 ఎకరాల భూములను కాజేశారని దుయ్య బట్టారు. ముఖ్యంగా ఫ్రీ హోల్డ్ పత్రాలు తీసుకుని భూములు దోచేశారన్నారు. విజయనగరం, విశాఖలోని భీమిలిపట్నంలో ఆయా భూములకు సంబంధించిన డీటేల్స్‌ను బయటపెట్టారు. దీనిపై పూర్తి స్థాయిలో తన వద్ద సమాచారం ఉందన్నారు.

మరోవైపు మూర్తి యాదవ్ ఆరోపణలపై శనివారం సీఎస్ జవహర్‌రెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. విశాఖ పరిసర ప్రాంతాల్లో తాను తన ఫ్యామిలీ సభ్యులు, బంధువులు ఎలాంటి అసైన్డ్ భూములు కొనలేదన్నారు. తన కుమారుడు ఉత్తరాంధ్రలోని ఏ జిల్లాకు వెళ్లలేదని పేర్కొన్నారు. మూర్తి ఆరోపణలను తీవ్రంగా ఖండించారాయన. చట్ట సభ ఆమోదం మేరకు జీవో జారీ అయ్యిందన్నారు. దాన్ని తనకు ఆపాదించడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. తనపై చేసిన ఆరోపణలను వెనక్కి తీసుకోని పక్షంలో పరువునష్టం దావా వేస్తానన్నారు. దీనిపై చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. మొత్తానికి భూముల వ్యవహారం రానున్న రోజుల్లో ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

Tags

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×